విజయనగరం

ఎయిర్‌పోర్టు భూసేకరణ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 15: భోగాపురంలో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న 390 ఎకరాల భూసేకరణను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు ముందుకు వచ్చిన రైతులకు ఆయా భూముల విలువను అనుసరించి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన వెబ్‌సైట్‌లో భూముల వివరాలను నమోదు చేయాలన్నారు. అవసరమైన చోట నిబంధనల ప్రకారం భూములు సేకరించాలన్నారు. సేకరించిన భూములలో ప్రభుత్వ కట్టడాలు, ప్రైవేటు కట్టడాలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. సేకరించిన భూములకు సమగ్ర వివరాలతో విమానాశ్రయ అథారిటీకి అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లే-అవుట్లను కూడా సిద్ధం చేయాలన్నారు. భూ సేకరణలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రగతిపై రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసమూర్తి, భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్లు అనిత, శ్రీలత, బాల త్రిపురసుందరి, డిఎఫ్‌ఒ వేణుగోపాలరావు, ఉద్యాన శాఖ డిడి లక్ష్మినారాయణ, పిటిసి సిఐ శ్రీహరిరాజు, భోగాపురం తహశీల్దార్ లక్ష్మారెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాపై రాజీలేని పోరాటం
* 19న యువభేరి సభకు జగన్ రాక
* వైకాపా నేత ధర్మాన కృష్ణదాస్
విజయనగరం(టౌన్), డిసెంబర్ 15: ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తామని వైకాపా జిల్లా ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలకమండలి సభ్యుడు పి సాంబశివరాజులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా 19వతేదీన జిల్లా కేంద్రంలో సోమవారం పూల్‌భాగ్ రోడ్డులోని జగన్నాథ్ కల్యాణమండపంలో జరిగే యువభేరి సభలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి యువతను ఉద్ధేశించి ప్రసంగిస్తారని చెప్పారు. అనంతరం బలిజపేట మండలంలోని చిలకలపల్లి,సుభద్ర గ్రామాల్లో పర్యటించి ఇటీవల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ఉద్యమం చేపట్టామని, ఢిల్లీ స్ధాయిలో ఒత్తిడి తెచ్చామని వివరించారు. ఆమరణ దీక్ష కూడా జగన్ చేపట్టారని గుర్తుచేశారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న మాటల్లో స్పష్టత లేదని అన్నారు. కేంద్రపై ఒత్తిడి తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వస్తే పలు రాయితీలు వస్తాయని , నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు. ఇటువంటి అంశంపై పార్టీ చేపట్టిన పోరాటంలో యువత పాల్గొని మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, బెల్లాన చందశేఖర్, మజ్జిశ్రీనివాసరావు పాల్గొన్నారు.