విజయనగరం

మంచి వ్యవసాయ పద్ధతులే సాగుకు దన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 12: మంచి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తే రైతులకు వ్యవసాయాభివృద్ధి ఉంటుందని కలెక్టర్ ఎం ఎం నాయక్ తెలిపారు. ఆచార్య ఎం జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణలో మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండు రోజులు పాటు నిర్వహించిన ఉత్తరకోస్తా మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహాసంఘ సమావేశం విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ ఎన్ వి నాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ఎం ఎం నాయక్ మాట్లాడుతూ వ్యవసాయాధికారులు, అనుబంధ విభాగాల అధికారులు, శాస్తవ్రేత్తలు గత రెండేళ్ల సాగులో ఎదురైన లోపాలు అధిగమించే విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో విస్తరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. ఏ రంగాలలో వెనుకబడి ఉన్నామో గుర్తించి రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలను శాస్తవ్రేత్తలు సిఫార్సు చేయాలని కోరారు. యూరియా వినియోగాన్ని గణనీయంగా తగ్గించి సూక్ష్మధాతు ఎరువులను నివారించే విధంగా జిల్లాలో అమలు చేసిన ప్రణాళిక వలన 2015-16 సంవత్సరంలో 32 నుండి 42 శాతం వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరిగిన విషయాన్ని గుర్తు చేసారు. మొక్కజొన్న సాగు విస్తృతంగా పెరుగుతున్నదని వేరుసెనగ, నూనెగింజలు, చిరుధాన్యాలు, అపరాల విస్తరణ పెరగాల్సి ఉందని చెప్పారు. రబీలో సాగు విస్తీర్ణం పెరగడానికి సలహా మండలి చొరవ తీసుకోవాలని కోరారు. అధిక దిగుబడిని ఇచ్చే మేలైన వంగడాలను పరిశోధన ద్వారా అందించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ విస్తరణ పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం వ్యవసాయంలో రెండంకెల వృద్ధి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయాన్ని గుర్తుచేసారు. జిల్లాలో వ్యవసాయ విస్తరణ పరిశోధనకు అనువుగా విజయనగరం డివిజన్‌లో పరిశోధనా కేంద్రం నెలకొల్పేందుకు అవసరమైన భూమిని ఆచార్య ఎన్ జి రంగా (మిగతా 2వ పేజీలో)
విశ్వవిద్యాలయానికి కేటాయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం డైరెక్టర్ డాక్టర్ కె రాజారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని చెబుతూ భూసారం లక్షణాలను గమనించి వాతావరణ మార్పుల ప్రభావం ముందుగానే రైతులకు తెలియజేయాలని అన్నారు. ఉత్తరాంధ్రలో వ్యవసాయ దిగుబడులు తక్కువగా రావడానికి గల కారణాలను ప్రస్తావించారు. . దీన్ని అధిగమించడానికి పరిశోధనా పరంగా మేలైన వంగడాలను వరి, అపరాలు పరిచయం చేసామని, వాటిపై మహిళ రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామస్థాయిలో, గిరిజన ప్రాంతాలలో ఇందుకు అనుగుణంగా పంటల ప్రణాళికలను సిద్ధం చేయాలని అన్నారు. యూనివర్సీటి పరంగా కోటి రూపాయలు పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు మంజూరు అయ్యాయని జిల్లా యంత్రాంగం స్థలం కేటాయిస్తే రైతులకు అందుబాటులో పరిశోధన స్థానం నెలకొల్పేందుకు విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం డైరెక్టర్ ఎన్ వి నాయుడు మాట్లాడుతూ మూడు జిల్లాలో పంటల స్థితిగతులు, ఎదురయ్యే ముఖ్య సమస్యలను అధిగమించడానికి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని కోరారు. అనకాపల్లి పరిశోధన కేంద్రం నుండి అందిస్తున్న జీవన ఎరువులను రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలోమూడు జిల్లాల వ్యవసాయ అధికారులు, రైతులు, శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు.