విజయనగరం

ఇండోర్ స్టేడియంకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), డిసెంబర్ 18: హుదూద్ తుపాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ఇండోర్ స్టేడియం అభివృద్ధికి చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో క్రీడల అభివృద్ధికి పెద్ద దిక్కుగా క్రీడాప్రాధికార సంస్ధ కార్యాలయంతోపాటు ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్, ఇతర ఇండోర్ పోటీలకు ఆతిథ్యం ఇస్తూ క్రీడాకారులకు గత 20 ఏళ్లకు పైగా సేవలు అందించింది. నిర్వహణ లోపం, పాలకులు పెద్దగా పట్టించుకోకపోవడం కారణంగా ఇండోర్ స్టేడియం అభివృద్ధి కుంటుపడింది. దీనికి తోడు ఇటీవల హుదూద్ తుపాను ప్రభావం తీవ్రతతో ఈస్టేడియం పైకప్పు దెబ్బతినగా, గోడలు నీరుకారి పెచ్చులు ఊడిపోయాయి. ముందుభాగంలోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. తాత్కాలికంగా చెక్క అట్టలు అడ్డుపెట్టారు. వెలుతురు, మరుగుదొడ్లు సరైనవి అందుబాటులో లేవు. క్రీడాసంఘాలు కొంతవరకు దెబ్డతిన్న వాటిని మరమ్మతులు చేసినా క్రీడాకారులకు అసౌకర్యంగా ఉన్నాయి. సరైన వెలుతురు, రీ-సౌండ్ ఇబ్బందులు వంటివి పట్టిపీడిస్తున్నాయి. సరైన డ్రైనేజీ విధానం లేక సమీపంలోని వాడుక నీరు, వానాకాలంలో వచ్చే నీరు ఇండోర్ స్టేడియం పరిసరాల్లో నిలిచిపోతుందని క్రీడాకారులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాన్ ధాటికి రక్షణ గోడలు కూలిపోయి పందులు, పశువులు ఆవరణలోకి ప్రవేశించి సమస్యలు సృష్టించడం వలన క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి సమస్యలు ఎదురయ్యేవి. ఇండోర్ స్టేడియం సమస్యలను పలుమార్లు స్ధానిక క్రీడాకారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా అసోసియేషన్ కూడా క్రీడల శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయన స్పందించి 18 లక్షల రూపాయలు మంజూరు చేయగా, స్ధానిక ఎమ్మెల్యే మీసాలగీత కూడా ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి 10 లక్షల రూపాయలను తనవంతుగా అందజేశారు. ఈ నిధులతో పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి.ఇతర క్రీడలతో పాటు బ్యాడ్మింటన్‌కు కూడా రాష్ట్ర, జాతీయ స్ధాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో జిల్లా , పట్టణ అసోసియేషన్లు ముందుకు రావడం, ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఈ ఏడాది చివరి నాటికి అభివృద్ధి పనులు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కలిసి వస్తే జనవరిలో ఇక్కడ వెటరన్ క్రీడాకారుల మీట్‌ను నిర్వహించాలని బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆలోచన చేస్తోంది.

నగదురహిత లావాదేవీలపై
మార్కెటింగ్ శాఖ దృష్టి
* గుర్తించిన రైతులకు అవగాహన

విజయనగరం(టౌన్), డిసెంబర్ 18: రాష్ట్రంలోని రైతు బజార్లలో నగదు రహిత లావాదేవీలపై మార్కెటింగ్ శాఖ దృష్టి సారించింది. కూరగాయలు అమ్ముకునే రైతులులో సగటు రైతులు చాలామంది నిరక్షరాస్యులు కావడంతో ఈ సమస్యను అధిగమించేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేయడంతో తాత్కాలికం నెలకొన్న చిల్లర సమస్యలకు తెరదించడంతోపాటు నగదు రహిత అమ్మకాల దిశగా అడుగులు వేయడానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన రైతులకు తొలివిడత స్వైప్, పేటిమ్ వంటి ఆధునిక నగదు రహిత విధానాలపై అవగాహన కల్పించి తదుపరి అమలు చేయాలనేది మార్కెటింగ్ శాఖ ఆలోచన. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, వినియోగదారులకు సమస్యలు రాకుండా కొనుగోళ్లు నగదు రహితంగా చేయాలని కార్యాచరణ సిద్ధంచేశారు. స్వైప్ మెషీన్లు నిరక్షరాస్యులైన వారికి సమస్య ఉత్పన్నం అవుతుందని భావించిన మార్కెటింగ్ శాఖ సులభతరంగా ఉండే పేటిమ్ వైపు మొగ్గుచూపుతోంది. పేటిమ్ విధానంలో రైతుకు ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంటు నెంబర్, పేటిమ్ బార్‌కోడ్ ఉంటే చాలు. ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోయినా పరవాలేదు. కూరగాయలు కొనుక్కున్న వినియోగదారుడు సెల్‌లో ఇందుకు సంబంధించిన పేటిమ్ సాంకేతిక పరిజ్ఞానం ఉంటే చాలు. రైతుకు పేటిమ్ సంస్థ ఇచ్చే బార్‌కోడ్ మీద సెల్‌ఫోన్ ఉంచి ఓకే చేయగానే రైతు ఖాతాలోకి వినియోగదారుడు చెల్లించాల్సిన గరిష్ట చిల్లర ఆన్‌లైన్‌లో చెల్లుబాటు అవుతుంది. ఈ విధానంలో వినియోగదారుడికి అవగాహన ఉంటే చాలు. నగదు రహిత లావాదేవీల దిశగా అడుగు వేయడానికి మార్కెటింగ్ శాఖ అధికారులు విజయనగరంలోని మూడు రైతుబజార్లలో రైతులకు, కిరాణా, బియ్యం షాపులు నిర్వహించే స్వయం ఉపాధి వ్యక్తులకు పేటిమ్ యంత్రాలు నిర్వహణపై అవగాహన కల్పిస్తోంది. ఎంపిక చేసిన రైతులకు కూడా కాలేజీ విద్యార్థుల చేత అవగాహన కల్పించేందుకు మార్కెటింగ్ శాఖ కార్యాచరణ రూపొందించింది. గుర్తించిన రైతులకు బ్యాంకు ద్వారా మిషన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. మిషన్లు అందుబాటులోకి రాగా ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని మార్కెటింగ్ విశాఖ రీజియన్ జెడి శ్రీనివాసరావు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.