విజయనగరం

బ్రాహ్మణుల అభివృద్ధికి క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 18: బ్రా హ్మణుల అభివృద్ధికి క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ దోహదం చేస్తాయని ఎపి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ జిల్లా సమన్వయకర్త పేరి రామయ్య పంతు లు అన్నారు. ఆదివారం కొత్తరోడ్డు సమీపంలోగల మాజీ ఎమ్మెల్యే తాడ్డి సన్యాసినాయుడు మామిడితోటలో గజపతినగరం నియోజకవర్గ స్థాయి బ్రాహ్మణుల సంక్షేమ సంఘం సమావేశం భారతీ శ్రీ నివాస్ జరిగింది. బ్రాహ్మణులను అ న్నిరకాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేశారన్నారు. ఇ టీవల రాజాంలో శాటిలైట్ బ్రాంచి ప్రా రంభించారన్నారు. ఈ సొసైటీ ద్వారా బ్రాహ్మణులకు రుణాలు అందజేసి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాలోని బ్రాహ్మణులు అందరు క్రెడిట్ కో- ఆపరేటివ్ సొసైటీలో సభ్యులుగా చేరాలని కోరారు. రాష్ట్రంలో బ్రాహ్మణులకు సం క్షేమ పథకాల కోసం కార్పొరేషన్‌కు రూ. 65 కోట్లు నిధులు కేటాయించింద న్నారు. అర్హులైన బ్రాహ్మణులందరు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ముజమ చేస్తార న్నారు. ఈ పథకాల అమలులో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బ్రాహ్మణ యువత పథకాల అమలులో భాగస్వామ్యం కావాల న్నారు. విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ వడలి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ బ్రాహ్మణులు ఐకమత్యంతో మె లిగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కో రారు. అనంతరం గజపతినగరం వేద గాయిత్రి బ్రాహ్మణ సంఘం వారి 2017 కేలండర్‌ను ఆవిష్కరించారు. వ్యాఖ్యాతగా ఉప కార్యదర్శి ఆకుండి శ్రీనివాసు వ్యవహరించిన సమావేశంలో న్యాయవాది కె.రమణాజీ, సంఘం అధ్యక్షుడు విశ్వనాథం, వెంకట గౌరీశంకరరావు, సంఘం నాయకులు ఇనగంటి సురేష్‌కుమార్, టిటిడి వేద పండితులు వేదుల భువనేశ్వర ప్రసాదశర్మ, డాక్టర్ వి. కృ ష్ణారావు, వ్యవస్థాపక అధ్యక్షుడు విశే్వశ్వరరావు, సంఘం నాయకులు మంత్రి ప్రగడ రామ్మూర్తి పంతులు, దువ్వూరి వెంకట సుబ్రహ్మణ్యశర్మ, ముద్దు వెంకట కుమార్ శర్మ, రాంభట్ల సుర్య సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

శాశ్వత ఉద్యోగులుగా గుర్తించే వరకు
ఆందోళన తప్పదు
* మోకాళ్లపై నిలబడి అర్ధనగ్నంగా నిరసన
విజయనగరం(టౌన్),డిసెంబర్ 18: కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించి శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించే వరకు ఆందోళన కొనసాగుతుందని జెఎసి నాయకులు మధుసూధనరావు స్పష్టంచేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మె ఆదివారం 17వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కలెక్టరేట్‌వద్ద రిలే దీక్షాశిబిరం వద్ద కాంట్రాక్టు లెక్చరర్లు మోకాళ్లపై నిలబడి అర్ధనగ్నంగా నిరసన వ్యక్తంచేశారు. ఈసందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ గత 17 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కనీసం ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ ఆందోళనలో సూర్యారావు, పోలినాయుడు, అప్పలసూరి పాల్గొన్నారు.

అదుపుతప్పి ఇంట్లోకి దూసికెళ్లిన కారు
విజయనగరం(టౌన్), డిసెంబర్ 18: ఇటీవల హైదరాబాద్‌లో మైనర్ కుర్రాళ్లు అతివేగంగా కారు నడిపిన సంఘటన మరువకముందే అదేరీతిలో విజయనగరం పట్టణంలో ఆదివారం సాయంత్రం ఒక ప్రమాదం చోటుచేసుకుంది. పూల్‌బాగ్ ప్రాంతంలోని బిట్ నెం.1 ఏరియాలో ఇంటి నెం. 93లోకి అదుపుతప్పిన కారు వేగంగా దూసికెళ్లింది. ఓడి-10 ఇ 8081 నెంబరు గల కారును 14 ఏళ్ల వయస్సుగల తొమ్మిదవ తరగతి చదువుతున్న కుర్రాడు డ్రైవ్ చేసినట్లు సమాచారం. మహేంద్ర కంపెనీకి చెందిన ఈ వాహనం స్టీరింగ్ అదుపు తప్పడంతో మైలపల్లి అప్పయ్యమ్మ ఇల్లు గోడ లోపలి సామాన్లు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని కుర్రాడు తండ్రి అంతవరకు నడిపి డ్రింక్ చేయడం కోసం కారును సెల్ఫ్‌లో ఉంచి కిందకు దిగాడు ఆ సమయంలో డ్రైవరు కొడుకు స్టీరింగ్ చేతిలోకి తీసుకుని ప్రమాదానికి కారణమయ్యాడు. ట్రాఫిక్ ఎస్సై నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.