విజయనగరం

అలరించిన ఘంటసాల మధుర గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, డిసెంబర్ 18: మరపురాని మధుర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు అని ఆత్రయం కళాపీఠం అధ్యక్షుడు జరజాపు ఈశ్వరరావు అన్నారు. 18వ ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎన్‌జిఓ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో ఆదివారం ఘంటసాల నిర్విరామ నీరాజనం జరిగింది. కబీర్‌షా అండ్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ప్రముఖ వ్యాపార వేత్త మాదేటి సూర్యారావు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి గాయనీ, గాయకులు పాల్గొని ఘంటసాలకు నిర్వీరామ నీరాజనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆత్రయం కళాపీఠం అధ్యక్షుడు జరజాపు ఈశ్వరరావు మాట్లాడుతూ ఘంటసాలకు సాలూరుతో ఆత్మబంధుత్వం ఉందన్నారు. పట్రాయిని సీతారామశాస్ర్తీ శిష్యులుగా సాలూరులో ఆయన సంగీత విద్యను అభ్యసించి రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు గావించారన్నారు. ఘంటసాల వంద పాటలకు పైగా సంగీత దర్శకత్వాన్ని వహించి వేలాది పాటలు తెలుగు, తమిళ, కన్నడ, తులు భాషలలో ఆలపించారన్నారు. 30సార్లు నేపథ్య గాయకుడుగా అమెరికా, జర్మనీ దేశాలలో ఆయన గీతాలను ఆలపించారన్నారు. భగవద్గీత కూర్పు ద్వారా మంచి గుర్తింపు పొందారన్నారు. ఘంటసాల పేరుతో ప్రభుత్వం అవార్డులు ఇస్తుందన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి ఎదురుగా అన్నమయ్య తరువాత పాడిన ఏకైక వ్యక్తి ఘంటసాలే అని అన్నారు. అనంతరం పార్వతీపురం, కాకినాడ, సాలూరు, విశాఖలకు చెందిన ఆర్కెస్ట్రా బృందాల గాయనీ, గాయకులు ఆలపించిన మధుర గీతాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బి.ఎస్.ఎన్.మూర్తి, జెబిఎస్ ట్రస్టు సభ్యులు జరజాపు సూర్యనారాయణ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు సి.హెచ్.లీలాప్రసాద్, కబీర్‌షా అండ్ పార్టీ అధినేత షేక్ భాషా, సాలూరు సాహితీ మిత్ర బృందం అధ్యక్ష కార్యదర్శులు జె.బి.తిరుమలాచార్యులు, కిలపర్తి దాలినాయుడు, వేలాదిమంది కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు.

వైకాపాతోనే సమస్యలు పరిష్కారం
* వైకాపా నేత పెనుమత్స
నెల్లిమర్ల, డిసెంబర్ 18: వైకాపా అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. ఆదివారం గాంధీనగర్, సెగిడివీధిలో గడపగడపకూ వైకాపా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తరువాత మరచిపోయిందని అన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను టిడిపి నిర్వీర్యం చేస్తుందన్నారు. రేషన్ కార్డులు, పక్కా గృహాలు, పింఛన్లు అర్హులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేయడంవలన సామాన్యులు పలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి వైఫల్యాలను ఎండగట్టడానికే గడపగడపకూ వైకాపా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ సురేష్‌బాబు, నాయకులు అంబళ్ల శ్రీరాములునాయుడు, చనమల్ల వెంకటరమణ, జానాప్రసాద్, మత్స సత్యనారాయణ, పతివాడ సత్యనారాయణ పాల్గొన్నారు.