విజయనగరం

ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), డిసెంబర్ 19: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివిరమణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు పేదలకు సేవలు గత పదేళ్లుగా అందిస్తున్న ఆశా వర్కర్లకు నెలకు కనీస వేతనం ఐదువేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెలంతా పనిచేసినా వచ్చే వేతనం పెరిగిన ధరల నేపధ్యంలో వారికి ఎటూ చాలదన్నారు. పారితోషికాలు పెంచాలని, పిఎఫ్ ఇతర సౌకర్యాలు కల్పించాలని, యూనిఫార్‌ంలు, అర్హులైన వారికి రెండో ఎఎన్‌ఎంగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈమేరకు వినతిపత్రం మీ-కోసం గ్రీవెన్స్‌లో అందచేశారు. ఈకార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బొత్ససుధారాణి, ప్రధానకార్యదర్శి రత్నం, జీవా పాల్గొన్నారు.

తెలుగు వారి కీర్తిని చాటిన ‘గరిమెళ్ల’
విజయనగరం(పూల్‌బాగ్),డిసెంబర్ 19: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కవి గరిమెళ్ల సత్యనారాయణ తన రచనలతో తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారని ఉపాధ్యాయుడు నారాయణరావు అన్నారు. పట్టణంలోని గాజులరేగలోని నారాయణ పాఠశాలలో తెలుగుభాషా సేవా సంఘం ఆధ్వర్యంలో గరిమెళ్ల వర్ధంతి జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మాకొద్దీ తెల్లదొరతనం’అని స్వాతంత్య్రోద్యమ కాలంలో తన రచనల ద్వారా ఎలుగెత్తిచాటారని చెప్పారు.ప్రజలను చైతన్యపరిచిన గరిమెళ్ల అనంతర కాలంలో దుర్భరమైన దారిద్య్రాన్ని అనుభవించి మరణించారన్నారు.తమిళభాషలోకూడా గరిమెళ్ల రచనలు చేశారన్నారు. ముందుగా గరిమెళ్ల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రామానాయుడు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.