విజయనగరం

గాంధీ పార్కు అభివృద్ధికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 19: పట్టణంలో గాంధీపార్కు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. ‘గాంధీ పార్కులో అసాంఘిక కార్యకలాపాలు’ అనే శీర్షికతో ఆంధ్రభూమిలో వచ్చిన వార్తపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ అమృత్ పథకం ద్వారా 50 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశామని తెలిపారు. ఈ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేసేందుకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఆమోదించారని, ప్రభుత్వం గ్రీన్‌సిగ్నిల్ ఇచ్చిందన్నారు. పార్కులో కనీస సదుపాయాలు లేకపోవడం వాస్తవమేనని, అమృత్ పథకంద్వారా విడుదలైన నిధులతో పార్కును సుందరవనంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పార్కులో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా ఏర్పాటుచేస్తామని తెలిపారు. పట్టణంలో అన్ని పార్కులను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆక్రమణలకు గురి కాకుండా పార్కుల చుట్టూ కంచె నిర్మాణం చేపడతామన్నారు.

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 19: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఇక్కడ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేశారు. రీజియన్ పరిధిలో ఉన్న విజయనగరం, శృంగవరపుకోట, సాలూరూ, పార్వతీపురం, శ్రీకాకుళం డిపో-1, శ్రీకాకుళం డిపో-2, పాలకొండ, టెక్కలి, పలాస డిపోలలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని, పిఆర్‌సి బకాయిలను ఇంతవరకు చెల్లించలేదని వారు వాపోయారు. గతంలో బకాయిపడిన ఏరియర్స్‌ను కూడా చెల్లించలేదన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ చెల్లించడం లేదని, ఫలితంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. బకాయిలను చెల్లించకపోవడం వల్ల ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని, మరోవైపు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పిఆర్‌సి బకాయిలను విడుదల చేసి తమ ఆర్థికంగా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

జెసిబి మరమ్మతులపై విచారణ జరిపించండి
* మున్సిపల్ కమిషనర్‌ను కోరిన ఆమ్‌ఆద్మీ పార్టీ
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 19: మున్సిపాలిటీకి చెందిన జెసిబి మరమ్మతులపై విచారణ జరిపించాలని ఆమ్‌ఆద్మీపార్టీ సిటీ కన్వీనర్ శీర స్వామినాయుడు డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి సోమవారం మున్సిపల్ కమిషనర్ నాగరాజుకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్వామినాయుడు మాట్లాడుతూ విజయనగరం మున్సిపాలిటీకి చెందిన జెసిబికి మరమ్మతులు చేసేందుకు కాంట్రాక్ట్‌కు గాజువాకకు చెందిన ప్రముఖ ఆథరైజ్డ్ మోటారు వాహనాల కంపెనీకి అప్పగించారని తెలిపారు. మరమ్మతుల నిమిత్తం ఏడు లక్షల రూపాయలు ఆ కంపెనీకి చెల్లించారని చెప్పారు. ఈ విషయమై ఆంధ్రభూమిలో ‘లక్షలు మింగి మూలకు చేరిన జెసిబి’ అనే శీర్షికతో ప్రచురితమైన వార్తను కమిషనర్ దృష్టికి పార్టీ నాయకులు తీసుకువెళ్లారు. మరమ్మతులు చేసిన నెలరోజులకే జెసిబి మూలకు చేరిందని, దీనివల్ల లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్నారు. దీనిపై పూర్తిస్ధాయిలో విచారణ జరిపించాలని, బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆమ్‌ఆద్మీపార్టీ జిల్లా కార్యదర్శి కె.దయానంద్, సిటీ కో-కన్వీనర్ ఎంబి అప్పారావుదొర పాల్గొన్నారు.