విజయనగరం

క్రిస్మస్‌కు చర్చిలు ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ప్రపంచ మంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ వేడుక. ఈపండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపేందుకు క్రైస్తవ సోదరులు, కుటుంబాలు సిద్ధమువుతున్నాయి. ఇందులో భాగంగా పట్టణంలోని పలు చర్చిలను అందంగా అలంకరించే పనులు జరగుతున్నాయి. మరో 24 గంటలలో క్రిస్మస్ పండుగ కావడంతో పట్టణంలోని చారిత్రక చర్చిలైన ఆర్ సి ఎం, సిమ్స్ బాప్టిస్ట్ చర్చి, ఇతర క్రైస్తవ ఆలయాలు అందంగా అలంకరిస్తున్నారు. శనివారం రాత్రినుండి క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. క్రైస్తవులు వారి ఇళ్లను రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించి క్రిస్మస్ స్టార్‌లను ఇంటి మేడపై ఏర్పాటుచేస్తున్నారు. చర్చిలు కూడా విద్యుత్తు దీపాలతోకాంతులీనే విధంగా చురుగ్గా ఏర్పాట్లు జరుగతున్నాయి. అంతేకాకుండా క్రీస్తుజననం తెలిపే బొమ్మలను, బెలూన్లలతో అలంకరిస్తున్నారు. దీంతో క్రిస్మస్ సందడి నెలకొంది.
రూ.2.50 కోట్ల చంద్రన్న కానుకల పంపిణీ
* జిల్లా పౌరసరఫరాల అధికారి శాంతికుమారి వెల్లడి

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 23: జిల్లాలో క్రిస్మస్, సంక్రాంతి చంద్రన్న కానుకల పేరిట 2.50 కోట్ల రూపాయల విలువైన సరకులను పంపిణీ చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల అధికారి కె శాంతికుమారి తెలిపారు. పట్టణంలో అలకాందకాలనీలో రేషన్‌షాపు-55లో శుక్రవారం కిస్మస్ చంద్రన్న కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ జిల్లాలో 6.67 లక్షల మంది తెలుపురంగు రేషన్‌కార్డుదారులు ఉన్నారని, వీరిలో 2.16 మంది క్రిస్టియన్లు ఉన్నారని తెలిపారు. వీరందరికీ సరకులను పంపిణీ చేస్తున్నామని, ఇప్పటికే 50శాతం సరకుల పంపిణీ పూర్తయిందన్నారు. జిల్లాలో 1399 రేషన్‌షాపుల ద్వారా చంద్రన్న కానుకలను పంపిణీ చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ-పోస్ విధానంతో నిమిత్తం లేకుండా సరకులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా పేదలు ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ కొర్నాన రాజ్యలక్ష్మి, టిడిపి నాయకులు రాజునాయుడు, లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు.