విజయనగరం

డ్వాక్రా రుణమాఫీ నిధులు మంజూరు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), డిసెంబర్ 26: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలో ప్రధానమైన డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ నిధులు మంజూరు కాక పొదుపు సంఘాల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌వద్ద పొదుపు సంఘం మహిళలు ఆందోళన చేశారు. ఈసందర్భంగా ఐద్వా నాయకులు ఇందిర, శ్రీదేవి, రమణమ్మ, లక్ష్మి మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలకు పొదుపు ఖాతాలు ఆన్‌లైన్ వెంటనే చేసి జిల్లాలో అర్హులైన సంఘాలకు పొదుపు రుణమాఫీ నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్.కోటలో సక్రమంగా పొదుపు కడుతూ రుణాలు సకాలంలో చెల్లిస్తున్నా ఎపిఎం కారణంగా అక్కడ 38 సంఘాల పొదుపు మహిళలకు రుణమాఫీ నిధులు జమ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడత రుణమాఫీ నిధులు ఆడపడుచులు వారి అవసరాలకు ఖర్చు చేసుకోవచ్చని చంద్రబాబు చెబుతున్నారని, వెలుగు అధికారుల తీరు కారణంగా వారికి అమలు కాలేని పరిస్ధితి నెలకొందని, జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని పొదుపు ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు.

గిరిజన సంక్షేమ శాఖలో అక్రమాలపై విచారణ చేయండి
* కలెక్టరేట్ వద్ద గిరిజనుల దీక్ష
విజయనగరం(టౌన్), డిసెంబర్ 26: గిరిజన సంక్షేమ శాఖలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద గిరిజనులు దీక్షలకు దిగారు. ఈ దీక్షలను ద్ధేశించి జిల్లా కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్ మాట్లాడుతూ గిరిజన హాస్టల్స్‌లో విద్యార్ధులకు భోజన మెనూ సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. 3376 మంది విద్యార్ధులకు మంజూరైన ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ మొత్తాలను వెంటనే విద్యార్ధుల ఖాతా లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, సిఆర్‌టిల పోస్టింగ్‌లు, డిప్యుటేషన్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. పర్యవేక్షణా లోపంవలనే గిరిజన విద్యార్ధులకు పోషక విలవలతో కూడిన భోజన మెనూ అమలు కావడం లేదని, ఫలితంగా పలు మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షల్లో పలువురు గిరిజనులు పాల్గొన్నారు.