విజయనగరం

గందరగోళంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 30: ఎప్పుడూ సాదాసీదాగా జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఈసారి గందరగోళంగా జరిగింది. అధికార పార్టీకి చెందిన 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధానంగా అధికారుల పనితీరుపై కౌన్సిల్ సభ్యులు విరుచుకుపడ్డారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన పనులు కూడా జరగడం లేదని, ఆమోదించకపోతే చైర్మన్ బాధపడతారు.. ఆమోదిస్తే పనులు చేయరు. అధికారుల పనితీరు ఏమాత్రం బాగోలేదంటూ 32వ వార్డు కౌన్సిలర్ ముద్దాడ చంద్రశేఖర్ అన్నారు. ఆమోదించి పనులు చేసేందుకు ఎంతఖర్చు చేశారో తెలియడం లేదని 17వ వార్డు కౌన్సిలర్ ఆదుర్తి వాసుదేవ్ చెప్పారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మున్సిపాలిటీలో నిధులు ఉన్నా పనులు జరగడం లేదని, మున్సిపాలిటీలో ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదని 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావుఅన్నారు. చేపల మార్కెట్ ఫైల్ ఎక్కడ ఉందో తెలియడం లేదని, దీనిపై తగిన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై సమాధానం చెప్పేందుకు మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ ప్రయత్నించగా, రామారావు అభ్యంతరం చెప్పారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదని, అధికారుల ద్వారా సమాధానాలు చెప్పించాలని చైర్మన్‌ను ఆయన కోరారు. ఈ సమయంలో ఇద్దరు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మున్సిపల్ అజెండాలో లేని విషయాలపై చర్చించడం సరికాదని చైర్మన్ అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగింది. మీకు నచ్చితే సమావేశంలో ఉండండి..లేకపోతే వెళ్లిపోండి..అంటూ చైర్మన్ మండిపడ్డారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న కౌన్సిలర్ రామారావు సమావేశం జరుగుతుండగానే బయటకు వెళ్లిపోయారు. అధికారపార్టీకి చెందిన రామారావు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం భావ్యం కాదని, బయట ఉంటే పిలవండి..అని మున్సిపల్‌వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు కోరారు. అందుబాటులో రామారావు లేకపోవడంతో అజెండాలో పొందుపర్చిన అంశాలను చదివేందుకు చైర్మన్ సిసి నవీన్ ప్రయత్నించగా, ప్రతిపక్ష కౌన్సిలర్ గాడు అప్పారావు అడ్డుపడ్డారు. రామారావు వచ్చిన తర్వాతే అజెండాలో అంశాలను చదవాలని కోరడంతో చైర్మన్ మండిపడ్డారు. సభ్యులను కించపర్చేవిధంగా మాట్లాడటం తగదని చైర్మన్ నుద్ధేశించి అప్పారావు అన్నారు. ఈ సందర్భంగా అజెండాలో పొందుపర్చిన అంశాలను ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు ప్రసాద్, మత్స్యరాజు, సంతోషికుమారి, మున్సిపల్‌మేనేజర్ ఆనందరావు పాల్గొన్నారు.