విజయనగరం

జన్మభూమిని సమర్థవంతంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, డిసెంబర్ 31: సమర్థవంతంగా నాల్గవ విడత జన్మభూమి సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మండల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుని అర్హులైన లబ్దిదారులకి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులందరికీ చంద్రన్న సంక్రాంతి సరుకులు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాలలోని ప్రజల్లో స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పించడంతోపాటు మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. రైతులు నుండి దరఖాస్తులను తీసుకొని ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని చెప్పారు. తహశీల్దార్ బి నీలకంఠరావు, ఎంపిడిఓ ప్రకాశరావు, మండల వ్యవసాయ అధికారి కె రవీంద్ర, ఎపిఎం పెంటమనాయుడు, ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ నాగేశ్వరరావు, పంచాయితీరాజ్ జెఇ అప్పలనాయుడు పాల్గొన్నారు.

కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలి* నోట్లో గడ్డి పెట్టుకుని నిరసన
విజయనగరం(టౌన్), డిసెంబర్ 31: లెక్చరర్లతో సమానంగా పనిచేస్తూ విద్యార్ధులకు పాఠాలు బోధిస్తున్నా కాంట్రాక్టు లెక్చరర్లను సమానపనికి సమాన వేతనం దిశగా ప్రభుత్వం గుర్తించకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని కాంట్రాక్టు లెక్చరర్ల జెఎసి నేతగోపి ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు అమలుచేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి కాంట్రాక్టు లెక్చరర్లు చేపట్టిన సమ్మె శనివారం నెలరోజులుకు చేరింది. కలెక్టరేట్ వద్ద పోరాట శిబిరంలో కాంట్రాక్టు లెక్చరర్లు ప్రభుత్వం తీరుకు నిరసనగా నోట్లో గడ్డి పెట్టుకుని వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జెఎసి నాయకులు గోపి మాట్లాడుతూ శాశ్వత లెక్చరర్లతో సమానంగా పాఠాలు చెపుతున్నా పనికి తగ్గ వేతనం అమలుకు నోచుకోలేదదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లెక్చరర్లు సమ్మెలో ఉండటం వలన కాలేజిలు వెలవెల బోతున్నాయని, విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి టివిరమణ, కాంట్రాక్టు ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సంఘం నాయకులు అప్పలసూరి, మెడికల్ రిప్రజెంటిటివ్ యూనియన్ నాయకులు రవి సంఘీభావం తెలిపారు. ఈదీక్షలో అప్పారావు, శ్రీనివాసరావు,శరత్, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.