విజయనగరం

జన్మభూమిలో సమాజ, కుటుంబ వికాసాలే ప్రధాన అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగో విడత జన్మభూమి కార్యక్రమంలో సమాజ, కుటుంబ వికాసాలే ప్రధాన అజెండాగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళిని చెప్పారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 15 అంశాలతో కుటుంబ వికాసం, పది అంశాలతో సామాజిక వికాసం కోసం కృషి చేస్తున్నామన్నారు. జన్మభూమిలో దాదాపు 40 శాఖలు ఉన్నాయని వీటి పనితీరుపై ఆయా శాఖలకు స్టార్ గుర్తింపునిస్తామన్నారు. ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉండేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఒడిఎఫ్, 24 గంటల విద్యుత్ సరఫరా, గ్యాస్ కనెక్షన్లు, ఫైబర్ కనెక్టివిటి, ఐఎంఆర్/ఎంఎంఆర్ వంటి ఐదు కనీస అవసరాలను పూర్తి చేసిన వార్డులకు, గ్రామాలకు స్టార్ గ్రామాలు, స్టార్ వార్డులుగా గుర్తింపునిస్తామన్నారు. ఇక పింఛన్లకు సంబంధించి నియోజకవర్గానికి రెండు వేల పింఛన్లు చొప్పున రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 43 లక్షల పింఛన్లు మంజూరు చేసినట్టు ఆమె తెలిపారు. నిజమైన అర్హులు ఉంటే వారికి పింఛన్లు తప్పక మంజూరు చేస్తామన్నారు. ఆహారభద్రత కింద రాష్ట్రంలో కొత్తగా 41 లక్షల కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశామన్నారు. సంక్రాంతి కానుకలు కింద రేషన్‌కార్డుదారులకు అందజేశామన్నారు. వచ్చే జూన్ నాటికి దీపం కింద అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇక నగదు రహిత లావాదేవీలలో దేశంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో సాలూరులో ఒకటొ వార్డు, బాడంగి మండలం ఆకులకట్ట గ్రామం, తెర్లాం మండలం లింగాపురంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించినట్టు గుర్తించామన్నారు. అలాగే జిల్లాలో 13310 మంది బాలికలకు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద బాండ్లు అందజేయాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా పింఛన్లకు వేలిముద్రలు పడక ఇబ్బందులు పడుతున్నవారు, మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారికి కైజల యాప్ ద్వారా వివరాలు సేకరించి పింఛన్లు మంజూరు చేస్తున్నామని మంత్రి మృణాళిని వివరించారు.
గందరగోళంగా జన్మభూమి
కొత్తవలస, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రసంగించిన నాల్గవ విడత జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా మారి ఎవరికీ అర్థంకాని పరిస్థితిలో ముగిసింది. మండలంలో బలిఘట్టాం, కొత్తవలస, మందిరామచంద్రపురం, చీపురువలస గ్రామాలో జరిగింది. తహశీల్దార్, ఎంపిడిలు రెండు టీమ్‌లుగా ఏర్పడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలకు ఏయే అవసరాలు కావాలో అనే సదుద్దేశ్యంతో కార్యక్రమం పెడితే, ప్రజలు ఆత్రుతతో సమావేశంలో ఏమి చేస్తారో వినకుండా గందగోళం చేస్తూ కార్యక్రమానికి ఆటంకం కలిగించారు. ఒక్కచోటపోతే మరో చోటైనా ప్రజలు తీరు మారలేదు. ముఖ్యంగా కొత్త పింఛన్లు వచ్చాయో లేదో! ఇళ్లు ఎవరికొచ్చాయి, బిల్లులు ఎవరికందాయి, కొత్తకార్డులు వచ్చాయా లేదోనని ఆత్రుతను కనబరిచారు. కార్యక్రమం మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. ప్రజబుత్వం చేస్తున్న పనులు, చేయబోయే నులు, కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, రోడ్లు, మంచినీరు, విత్తనాలు, రాయితీలు ఇలా అనేక విషయాలపై చర్చించేందుకు అధికారులు ప్రయత్నించారు. చివరకు విద్యార్థులకు స్కాలర్ షిపల్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వాయిదా, వివిధ ప్రమాదాల్లో చనిపోయిన వారికి బీమా బాండ్లు, చెక్కులు వంటివి పంపిణీ చేసారు. ఎక్కువగా విద్యార్తుల స్కాలర్ షిప్‌లు చెక్కులను అందజేశారు. కొత్తవలస పంచాయితీ కార్యాలం వద్ద సమావేశం ఏర్పాటు చేయగా ఒకవైపు పింఛన్‌దార్లు. మరోవైపు సమావేశానికి వచ్చిన వారి మధ్య తోపులాట జరిగింది. సమావేశపు స్థలం మారిస్తే బాగుండేదని పలువురు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో డిటి రమణ, ఎంఇఓ శ్రీనివాసరావు, వార్డు మెంబరు మేలాస్ర్తి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.