విజయనగరం

ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జనవరి 3: రాష్ట్రాన్ని అన్నిరంగాలలోను ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రజలు అండగా ఉండాలని ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. పట్టణంలో మంగళవారం జరిగిన ‘జన్మభూమి-మా ఊరు’ వార్డు సభలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉండాలన్నదే ముఖ్యంమత్రి ఆకాంక్ష అని అన్నారు. అందువల్ల ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్టవ్రిభజన తర్వాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని, అయినప్పటికీ అభివృద్ధిలో ముఖ్యమంత్రి వెనుకడుగు వేయలేదని అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, ఆయా సమస్యలను పరిష్కరించేందుకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, జన్మభూమి పట్టణ కమిటీసభ్యులు డాక్టర్ విఎస్ ప్రసాద్, కరణం విజయకుమారితోపాటు 24వ వార్డులో పాల్గొన్న జన్మభూమి ప్రత్యేక అధికారి రేఖారాణి తదితరులు పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధి టిడిపితోనే సాధ్యం: ఎమ్మెల్యే నాయుడు

బొండపల్లి, జనవరి 3: తెలుగు దేశం ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని గరుడుబిల్లి గ్రామంలో నాల్గవ విడత జన్మభూమి- మా వూరు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నాయుడు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అభివృద్ధి సంక్షేమ బాట వీడలేదని అన్నారు. పేద ప్రజల అభివృద్ధే తెదేపా థ్యేయమని చెప్పారు. చంద్రన్న బాటతో కోట్లాది రూపాయల వ్యయంతో సిమెంటు రోడ్లు, కాలువలు నిర్మించామని గుర్తు చేశారు. ప్రభుత్వం అర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులు అందిస్తున్నదని అన్నారు. కుటుంబ వికాశానికి, సమాజ వికాసమే తమ పార్టీ థ్యేయమని అన్నారు. గరుడుబిల్లి గ్రామానికి మంచినీరు అందిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించి మంచినీటిని అందిస్తున్నామని చెప్పారు. గ్రామానికి త్వరలో రోడ్డు నిర్మాణం చేపట్టి గ్రామస్తులు ఆశలను నెరవేరుస్తానని చెప్పారు. కాగా తొలుత ఎన్టీఆర్ సుజల స్రవంతిలో భాగంగా ఎంపి కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు నిధులతో నిర్మించిన మినరల్ వాటర్‌ప్లాంట్ యూనిట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జన్మభూమిలో సిఎం సందేశాన్ని, ప్రతిజ్ఞను ఎంపిడి ఓ ప్రకాశరావు చేయించారు. గ్రామ సభలో బాలికా సంవరక్షణ బాండ్లను ఎమ్మెల్యే నాయుడు చేతులు మీదుగా లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ ప్రసన్న, ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.