విజయనగరం

అరకొర సౌకర్యాలు-మహిళల అవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జనవరి 3: రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం విజయనగరం పట్టణంలో అబాసులపాలవుతోంది. జన్మభూమి వార్డుసభలకు వచ్చే ప్రజలకు కనీస సదుపాయాలను కల్పించడంలో మున్సిపల్ యంత్రాంగం విఫలమవుతోంది. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించేందుకు కౌంటర్లను ఏర్పాటుచేయకపోవడం వల్ల దరఖాస్తులను ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా మంచినీటి సదుపాయం లేకపోవడం, కుర్చీలు చాలకపోవడం వల్ల మహిళలు నరకయాతనలు పడుతున్నారు. గత రెండురోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఎమ్మెల్యే మీసాల గీతగాని, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కనీసం పట్టించుకోవడం లేదని మహిళలు వాపోతున్నారు.
కనీస సదుపాయాలను కల్పించకుండా మున్సిపల్ అధికారులు కూడా చొద్యం చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో 3,4,12,13,23,24,33,34 వార్డులలో మంగళవారం జన్మభూమి కార్యక్రమం జరిగింది. రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాల మంజూరు, ఇళ్ల నిర్మాణానికి రుణాలు, పింఛన్లు మంజూరు తదితర వాటి కోసం దరఖాస్తులను సమర్పించేందుకు అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అక్కడ వసతులు లేకపోవడం వల్ల చెట్లు కింద, ఎండలోను దరఖాస్తులను నిలబడి దరఖాస్తులను పూర్తి చేయవలసి వచ్చిందని మహిళల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కూర్చోనేందుకు కుర్చీలు చాలకపోవడమే కాకుండా మంచినీటిని కూడా సరఫరా చేయకపోవడం వల్ల నరకయాతనలు పడ్డారు. దరఖాస్తులను స్వీకరించేందుకు గతంలో మాదిరిగా కౌంటర్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యారు. వార్డుసభలలో కనీస సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు చేయవలసిన జన్మభూమి కమిటీసభ్యులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడంతో మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వపరంగా జరగవలసిన జన్మభూమి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. జన్మభూమి వార్డుసభలో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్, జన్మభూమి కమిటీసభ్యులతోపాటు పలు శాఖఅధికారులు మాత్రమే సభావేదికపై ఉండవలసి ఉండగా, ఆయా కుర్చీలను నాయకులు ఆక్రమించుకోవడంతో అధికారులు వెనుక వరుసలో కూర్చొనవలసి వస్తోంది. కొన్నివార్డులలో అధికారులు కూర్చొనేందుకు కుర్చీలు లేకపోవడం వల్ల నిలబడవలసి వస్తోంది. ఈ పరిణామాల పట్ల అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైనవారికి ఇళ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయడంలేదని అబాద్‌వీధి, ఇందిరానగర్, కాటవీధి తదితర చోట్ల మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణను మహిళలు నిలదీశారు. వార్డుసభలలో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, జన్మభూమివార్డుసభ టీమ్‌లీడర్లు ఎస్.మత్స్యరాజు, వి.శోభన్‌బాబు, పిఎస్‌వివి ప్రసాద్, డి.ఆనందరావుతోపాటు ఆవార్డులకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

లోగిశలో జన్మభూమి బహిష్కరణ
గజపతినగరం, జనవరి 3: మండలంలోని లోగిశ గ్రామంలో రెండవ రోజు జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. రామ మందిరం వద్ద జన్మభూమి గ్రామసభ ఏర్పాటు చేయగా అధికారులను గ్రామానికి చెందిన వైకాపా పార్టీకి చెందిన యువకులు నిలదీసి సభను బహిష్కరిస్తున్నామని తేల్చి చెప్పడంతో అధికారులు సమాధానం చెప్పలేక వెను దిరిగారు.
జడ్పీటిసి మక్కువ శ్రీధర్ స్వగ్రామం కావడంతోపాటు సభకు జడ్పీటిసి శ్రీధర్ హాజరు కాకపోవడంతో పింఛన్లు, రేషన్‌కార్డులు అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు మంజూరు చేయడంతోపాటు అర్హులని తొలగించారని నిలదీశారు. తెదేపాకు చెందిన వారికి అర్హత లేకపోయినా పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేసి అర్హులవి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఉప తహశీల్దార్ కె.జయరామ్, సూపరింటెండెంట్ శివప్రసాదరావు యువకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో వెనుదిరిగారు. మరోపక్క రామన్నపేటలో జరిగిన సభకు అధికారులు సకాలంలో హాజరు కాకపోవడంతో జడ్పీటిసి మక్కువ శ్రీధర్ అధికారులపై మండిపడి గ్రామసభకు హాజరుకాకుండానే వెనుదిరిగారు. జన్మభూమి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.