విజయనగరం

కొత్తఖాతాలు తెరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపాడ, జనవరి 9: విశాఖగ్రామీణ బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరిచేందుకుగాను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఎపిజివిబి విజయనగరం ప్రాంతీయ కార్యాలయం పరిపాలనాధికారి జి. ఉపేంద్ర చెప్పారు. మండల కేంద్రమైన వేపాడలోని ఎపిజివిబి బ్రాంచిలో నూతన ఖతాలు తెరిచేందుకు ఖాతాదారులు బారులు తీరి పడుతున్న పాట్లును స్థానిక విలేఖరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్న సంగతి వాస్తవమేనని అన్నారు. ఖాతాదారుల ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రత్యేక కౌంటర్లు ద్వారా సేవలు అందిచడం జరుగుతుందని చెప్పారు. రిజర్వ్‌బ్యాంకు నిబంధనల మేరకు నగదు ఇవ్వడం జరుగుతుందని, గ్రామాలలో ఖాతాదారులకు ఇతోధికంగా సేవలందించేందుకుగాను వేపాడ బ్రాంచి పరిధిలో 11సేవా కేంద్రాలు ఉన్నాయని అన్నారు. వీటి ద్వారా ఖతాదారుల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ బ్యాంకు పరిశీలనలో ఆయన వెంట బ్యాంకు మేనేజరు నజీమ్ ఫీల్డు ఆఫీసర్ తదితరులు ఉన్నారు.
లోడింగ్ , అన్‌లోడింగ్ కార్మికులను
విధుల్లోకి తీసుకోవాలి
* కోర్టు ఉత్తర్వులు అమలుకై కార్మికుల ధర్నా
విజయనగరం(టౌన్), జనవరి 9: గరివిడి ఫేకర్‌లో లోడింగ్ అన్ లోడింగ్ వేగన్ వర్క్‌లో పనిచేస్తున్న కార్మికులను కోర్టు ఉత్తర్వులు అమలుచేస్తూ విధుల్లోకి తీసుకోవాలని ఫేకర్ లేబర్ యూనియన్ ప్రధానకార్యదర్శి రాజానరమణ డిమాండ్ చేసారు. సోమవారం ఈమేరకు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014నుండి గత మూడేళ్లగా ఈసమస్య పరిష్కారం కాకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. యాజమాన్యం అనుసరిస్తున్న విధానంపై యూనియన్ తరపున ఉమ్మడి హైకోర్టులో రిట్ వేసామని కోర్టు ఉత్తర్వులు కార్మికులకు న్యాయం చేసే విధంగా ఉన్నాయని వివరించారు. అయినా వాటిని అమలు చేయకుండా యాజమాన్యం సర్వీస్ టాక్స్ పేరుతో కుంటిసాకులు చెపుతున్నదని ఆరోపించారు. అంతేకాకుండా కాంట్రాక్టు పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఈనేపథ్యంలో జిల్లా యంత్రాంగం జోక్యం కోరుతూ కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టామని చెప్పారు. సుమారు 267 మంది కార్మికులు ఆవేదనను అర్ధంచేసుకుని తగు న్యాయం చేయాలని కోరారు.