విజయనగరం

ముగ్గులు, భోగిపండ్లతో కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జనవరి 13: సంక్రాంతి సంబరాలకు ముందుగా వచ్చే భోగిపండుగను పట్టణ ప్రజలు ఆనందోత్సాహాల నడుమ భోగి మంటలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒకరి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో సందడిగా కలియ తిరిగారు. ఏడాది వయసుగల పిల్లలు ఉన్న కుటుంబాలలో వారి చిన్నారులకు భోగిపండ్లు వేసే వేడుకలు నిర్వహించారు. పెద్దల చేతుల్లో అక్షింతలు వేయించి ఆశీస్సులు అందచేసారు. చిన్నారులకు భోగి పండ్లు చాక్ లెట్లు , స్వీట్లు పంచిపెట్టారు. సాయంత్రం ముత్తయిదువలతో పేరంటం జరిపి తాంబూలాలు అందచేసారు. ఇక భోగి పండుగ తరువాత వచ్చే అతి పెద్ద సందడి సంక్రాంతి. పూర్వీకులు, తాతలు, పెద్దలను స్మరించుకుంటూ పూజాదికాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. పురోహితులకు పెద్దల పేరుమీద వస్రాలను దానం చేసి పండుగలో కట్టుబాట్లకు, సంప్రదాయాలకు విలువ నిచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా పండుగ సందర్భంగా కొత్త బియ్యంతో వండే పొంగలి తయారు చేయడం కోసం తీపిని ఇచ్చే చెరకు కర్రలను పట్టణ వాసులు కొనుగోలు చేసారు.