విజయనగరం

త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 13: ఉత్తరాంధ్ర పట్ట్భద్ర ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎంవిఎస్ శర్మ పదవీకాలం మార్చి 29 వరకు గడువు ఉన్నప్పటికీ ముందుగానే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ దిశగా ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎన్నికల ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. మరోపక్క ఎన్నికల కేంద్రాలను కూడా ఎంపిక చేశారు. ఏ క్షణంలో నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బహుశా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కావచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి టిడిపి, బిజెపి శ్రేణులు కలసి ఒకే అభ్యర్థిని బరిలో దింపుతారా? లేదా ఎవరికి వారు రంగంలో దిగుతారా అన్నదీ స్పష్టం కాలేదు.
కాంగ్రెస్ నుంచి ఆదిరాజు, సిపిఎం నుంచి అజశర్మ, స్వతంత్ర అభ్యర్థులు అప్పారావు దొర, పతివాడ రమణ తదితరులు గత రెండు నెలలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తుది ఓటర్ల జాబితా కూడా విడుదల కావడంతో అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి గడువు తక్కువగానే ఉండవచ్చని విశే్లషకులు చెబుతున్నారు.
ఓటర్ల తుది జాబితా
ఉత్తరాంధ్ర పట్ట్భద్ర నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి విడుదల చేశారు. ఉత్తరాంధ్ర పట్ట్భద్ర నియోజకవర్గ స్థానానికి మొత్తం 1,55,357 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,04,063 మంది, మహిళలు 51,333 మంది, ఇతరులు 561 మంది ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 31,313 మంది, విజయనగరం జిల్లాలో 34,570 మంది, విశాఖ జిల్లాలో 90074 మంది ఓటర్లు ఉన్నారు. విజయనగరం జిల్లాలో పురుషులు 24,308 మంది, మహిళలు 10,167 మంది , ఇతరులు 95 మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పురుషులు 23096 మంది, మహిళలు 8063 మంది, ఇతరులు 154 మంది ఓటర్లు ఉన్నారు.
విశాఖ జిల్లాను పరిశీలిస్తే.. పురుషులు 56659 మంది, మహిళలు 33103 మంది, ఇతరులు 312 మంది కలిపి మొత్తం 90074 మంది ఉన్నారు. ఓటర్ల తుది జాబితా, ఎన్నికల పోలింగ్ కేంద్రాల ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి.