విజయనగరం

పేదలకు మెరుగైన డయాలసిస్ వైద్యసేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జనవరి 15: వెనుకబడిన విజయనగరం జిల్లాలో పేదలకు డయాలసిస్ యూనిట్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈవైద్య సేవలు వినియోగించుకుంటున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దాదాపు మూడేళ్ల కిందట ప్రారంభించిన ఈ యూనిట్ ద్వారా నిత్యం పదుల సంఖ్యలో రోగులకు డయాలసిస్ వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే వ్యాధి నిర్ధారణ చేసే విభాగం అందుబాటులోలేకపోవడం విచారకరం. కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురైన వారు డయాగ్నో చేయించుకున్న తరువాత మాత్రమే ఈ యూనిట్‌లో సేవలు అందించగలుగుతున్నారు. డయాగ్నో కోసం కెజిహెచ్, లేదా పట్టణంలోని ప్రయివేటు ఆసుపత్రుల్లో చేయించుకోవాల్సి వస్తోంది. అక్కడ వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఇక్కడ డయాలసిస్ కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. నిర్ధారణ చేసిన ఆసుపత్రిలోనే మొదటి విడత డయాలసిస్ చేయించుకుంటూ రెండో విడతకు కేంద్ర ఆసుపత్రిలోని యూనిట్‌కు వస్తున్నారని చెపుతున్నారు. డయాలసిస్ యూనిట్‌లో ప్రస్తుతం ఎనిమిది పడకలు అందుబాటులో ఉన్నాయి. ఒక రోగికి డయాలసిస్ నిర్వహించడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. నెలకు సుమారు ఏడునుండి ఎనిమిది వందల మందికి డయాలసిస్ విభాగం ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. డయాలసిస్ ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకోవాలంటే మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఎన్టీర్ ఆరోగ్యశ్రీ కింద అందుతుండటంతో పేద మధ్యతరగతి రోగులకు ఈ యూనిట్ వరంగా మారింది.
బీచ్ కారిడార్‌తో
ఉత్తరాంధ్రకు కొత్తశోభ

విజయనగరం, జనవరి 15: విజయనగరం జిల్లాలోని భోగాపురం నుంచి విశాఖపట్నంలోని భీమునిపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పోర్టులను కలుపుతూ బీచ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ పోర్టులను కలుపుతూ బీచ్ కారిడార్ నిర్మాణం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లో సుమారు 120 కిలోమీటర్లు విస్తరించి ఉన్న తీర ప్రాంతంలో నాలుగు లైన్ల బీచ్‌రోడ్డు నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల బోగాపురం, పూసపాటిరేగ తీరప్రాంతంలో సర్వే కూడా జరిపినట్టు సమాచారం. కాగా, పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా సమకూర్చుకోడానికి పథకాన్ని రూపొందించారు. కోస్టల్ కారిడార్‌లో భాగంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధిపరచేందుకు ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా బీచ్‌రోడ్డులో స్టార్ హోటళ్లను, పార్కులను ఏర్పాటు చేయనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భీమునిపట్నం మీదుగా విశాఖపట్నం, కాకినాడ పోర్టును కలుపుతూ బీచ్‌రోడ్డును విస్తరించనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చినపుడు ప్రకటించిన విషయం విదితమే. జిల్లాకు చెందిన మంత్రి కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అంతేగాకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ వారిని భాగస్వామ్యం కల్పించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. కోస్తా తీరంలో ఉన్న స్థలం అటవీశాఖకు చెందినదికావడంతో వారి అనుమతి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏది ఏమైనప్పటికీ బీచ్ కారిడార్ ద్వారా ఉత్తరాంధ్రకు కొత్తశోభ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఈ ఏడాదైనా అడ్మిషన్లు జరిగేనా?
* గిరిజన విశ్వవిద్యాలయం భవన నిర్మాణమెప్పుడు?
* మూడు రాష్ట్రాలకు మేలు
పరిశీలించారు. గిరిజన యూనివర్శిటీ నెలకోల్పాలంటే 300 ఎకరాల విస్తీర్ణం అవసరం ఉంటుందని భావించారు. అందులో భాగంగా పాచిపెంట మండలంలోని విజయనగరం, ఆండ్ర, చినమేరంగి సంస్థానాలకు చెందిన ఇనాం భూములు 30వేల ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. అందులో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు 300 ఎకరాలు ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. పాచిపెంట మండలం పెదకందూరు, గొట్టూరు ప్రాంతాల్లో సువిశాలమైన భూమి ఉండటంతో అక్కడ యూనివర్శిటీ నెలకోల్పేందుకు అనువుగా ఉంటుందని అప్పటి పార్వతీపురం డివిజన్ సబ్‌కలెక్టర్ శే్వతామహంతి స్పష్టం చేశారు. అంతేగాకుండా ఆ ప్రాంతంలో గిరిజన యూనివర్శిటీని నెలకోల్పితే అటు ఒడిషా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని అధ్యయనాల ద్వారా తేలింది. అయితే ఆ తరువాత ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభిస్తామని ప్రకటించి మూడేళ్లు కావస్తున్న ఎక్కడ గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు గత ఏడాది నుంచి గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు జరుపుతామని ప్రకటించి ఏడాది గడచినా ఈ ఏడాది కూడా ఒక కొలిక్కి రాలేదు. స్థల సేకరణ పూర్తయినప్పటికీ భవన నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అలాగే అడ్మిషన్లకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. దీంతో ఈ ఏడాదైనా గిరిజన విశ్వవిద్యాలయానికి అడ్మిషన్లు జరుగుతాయో, లేదోనన్నదీ స్పష్టం కావడం లేదు.

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం

తక్కువ ధరకు ధాన్యం కొంటే వారిపై క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆదేశించారు. ధాన్యంలో 17 శాతానికి మించి తేమ ఉండకూడదు. అంతకు మించి 22 శాతం వరకు తేమ ఉన్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వాటిని కొనుగోలు చేస్తారు. 17-22 శాతం మధ్యలో ఒక్కొ శాతానికి కేజి ధాన్యం ధరను నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో గ్రేడ్-ఎ ధాన్యం క్వింటాలుకు రూ.1510, 75 కిలోల బస్తాకు రూ.1132.50 వంతున చెల్లిస్తారు. సాధారణ రకం క్వింటాలుకు రూ.1470, 75 కిలోల బస్తాకు రూ.1102.50 చొప్పున చెల్లిస్తారు. ఈ ధరల కన్నా తక్కువకు ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రతిసారి ధాన్యం మిల్లర్లపై నియంత్రణ కొరవడుతొంది. రైతుల నుంచి మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యానికి సరైన లెక్కలు చూపడం లేదు. దీనిని అధికారులు కూడా సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. ఈ దఫా దీనిని అడ్డుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు ఇచ్చేటపుడు వాటి వివరాలను తప్పనిసరిగా ఎ-రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రైవేటుగా మిల్లర్లు కొనుగోలు చేసిన వాటి వివరాలను బి-రిజిస్టర్‌లో నమోదు చేయాలి. గతంలో వీటిని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అక్రమాలు చోటుచేసుకునేవి.
ఇదిలా ఉండగా రవాణా ఛార్జీల సమస్య తలనొప్పిగా మారింది. రైతు కల్లం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలిస్తే దానికి నేరుగా రవాణా ఛార్జీలు చెల్లించేలా ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రం సూచనల మేరకు కల్లం నుంచి మిల్లరు ధాన్యాన్ని రైస్ మిల్లులకు రవాణా చేస్తే ఆ ఛార్జీలను మిల్లర్లకు చెల్లించేలా ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు మాత్రం ధాన్యం నమూనాలను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి పరిశీలించుకోవాలి. కాగా, మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ కింద రూ.50కోట్లు చెల్లిస్తామని, తమకు రూ.250 కోట్లు ధాన్యం సేకరించేందుకు అవకాశం కల్పించమని కలెక్టర్‌ను కోరారు. అలాగే రైతు నుంచి ధాన్యం సేకరించిన రెండు రోజుల్లోగా రైతు బ్యాంకు ఖాతాలకు ఆయా మొత్తాలను జమ చేస్తామని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బ్యాంకు గ్యారంటి కింద 1:4 కు ప్రభుత్వం అంగీకరించినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించిన విషయం విదితమే. దీంతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం కాగలవని భావిస్తున్నారు.

గోగును అధిగమించడమెలా..?

విజయనగరం, జనవరి 15: ఉత్తరాంధ్రలో అత్యిధికంగా గోగు పండించే ప్రాంతాల్లో విజయనగరం ఒకటి. రాష్ట్రంలోనే ఈ పంట ఎక్కువగా ఇక్కడ సాగుచేస్తున్నారు. జిల్లాలోని జూట్ పరిశ్రమలు అధికంగా ఉండటంతో వీటికి మంచి డిమాండ్ ఉంది. అంతేగాకుండా మెట్ట భూములకు సరైన నీటి వసతి లేని కారణంగా ఎక్కువ మంది రైతులు ఈ పంటను ఎంపిక చేస్తున్నారు. ఈ గోగుతో గోనె సంచులు, పురితాళ్లు, తివాచీలు, జూట్ బ్యాగ్‌లను తయారు చేస్తున్నారు. వాటితోపాటు కాగితాలు, పేపర్ ప్లేట్లు, కార్డుబోర్డులు తయారు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ పారిశ్రామిక వేత్తలు ఆ దిశగా ముందుకు రావడం లేదు. కాగా, జిల్లాలో గోగు రైతులకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర నామ మాత్రంగానే ఉంటుంది.
బొబ్బిలి, బలిజపేట, చీపురుపల్లి, పార్వతీపురం, గజపతినగరం కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో పదిశాతానికి మించి నార కొనుగోళ్లు జరగడం లేదు. జిల్లాలో మిడిల్ బాటమ్, బి బాటమ్ గ్రేడుల నార మాత్రమే లభ్యమవుతుంది. జెసిఐ ప్రకటించిన ధరలకు, ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్న ధరలకు 400 రూపాయల వ్యత్యాసం ఉంటుంది. అయినప్పటికీ రైతులు వెంటనే నగదు చెల్లిస్తున్నారన్న కారణంతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
ప్రతిబంధకాలను అధిగమించడమెలా?
ఉత్తర కోస్తాలో సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా గోగు పంటను సాగుచేస్తుంటారు. ఈ పంటను వర్షాధార పంటగా సాగు చేస్తున్నారు. గత కొనే్నళ్లుగా ఈ పంట సాగు తగ్గుతూ వస్తుంది. గోగు సాగులో ప్రతిబంధకాలను ఏ విధంగా అధిగమించాలనే విషయమై శాస్తవ్రేత్తల బృందం అధ్యయనం జరిపింది. గోగుసాగులో ప్రతిబంధకాలు మార్కెట్‌లో గోగు నార తక్కువ ధర పలకడం, రైతు పొలాల్లో ఎకరా విస్తీర్ణం 5-6 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. కూలీల కొరత, అధిక కూలీ చెల్లించాల్సి రావడం, కలుపు సమస్య ఎక్కువగా ఉండటం వల్ల అధిక సంఖ్యలో కూలీలు అవసరమవుతున్నారు. రెండు గొప్పులకు ఎకరాకు 30 మంది కూలీలు అవసరం.
గోగు నారకు అగ్నిప్రమాదాలు ఎక్కువ, నిల్వకు గోదాముల సదుపాయం లేదు. కనుక తక్కువ మార్కెట్ ధర ఉన్నా బలవంతంగా అమ్ముకోవాల్సి వస్తుంది. దీర్ఘకాలిక పంట కావడం తదితర కారణాల వల్ల రైతులు ఈ పంటను సాగుచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇతర పంటలైన మొక్కజొన్న, అపరాలు 80-90 రోజుల్లో కోతకు వస్తున్నాయి. గోగు పంటకు రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల వీటివల్ల వైరస్ వ్యాధి సోకి గోగు పెరుగుదల నిలిచిపోతుంది. గోగు నార ఊరవేతకు తగినంత నీరు లేకపోవడంచ, ఊరవేత కష్టతరంగా మారడం, నారతీసిన గోగు కట్టి పుల్లలకు విలువ లేకపోవడం వల్ల కూలీలను పెట్టి నార తీయాల్సి వస్తుంది. ఎకరా పొలంలో నార తీయడానికి 20 మంది మహిళా కూలీలలు, 8 మంది మగ కూలీలు అవసరం ఏర్పడుతుంది. సిఫార్సు మేరకు ఎరువులు వాడకపోవడం, రైతులు అవగాహన లోపం వల్ల భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులు గోగు పంటకు వాడటం లేదు. యూనిరియాను మాత్రం పైపాటుగా వేస్తున్నారు. దీనివల్ల గోగు పైరుకు చీడపీడలను తట్టుకునే శక్తినిస్తుంది. అధిక దిగుబడి నిచ్చే గోగు రకాలు అందుబాటులో లేకపోవడం, ప్రస్తుతం ఉన్న కలింగ, దుర్గ, బీమిలి రకాలు రైతుల పొలాల్లో ఎకరాకు ఐదుక్వింటాళ్ల నుంచి 8 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడినిస్తున్నాయి. మొక్కజొన్న, పత్తిసాగుపై రైతులు ఎక్కువగా మక్కువ చూపడం వల్ల గోగు పండించే భూముల్లో పత్తి, మొక్కజొన్న పంటలసాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు.
ఇనుప తెగులు, వైరస్ తెగులు ఎక్కువగా ఆశించి దిగుబడి తగ్గడం, సస్యరక్షణ మందులను పిచికారి చేయకపోవడం, విత్తనశుద్ధి చేయకపోవడం, అవగాహన రాహిత్యం వల్ల రైతులు సస్య రక్షణ మందులను పిచికారి చేయడం, విత్తన శుద్ధి చేయడం లేదు. దీనివల్ల చీడపీడలు వ్యాపిస్తున్నాయి.
గోగు నార ఉత్పత్తులకు ప్రత్యమ్నాయంగా ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం వల్ల గోగునారతో చేసి సంచులు, తాళ్లకు గిరాకీ లేకపోవడం, గోగునార నిల్వకు గోదాములు అందుబాటులో లేకపోవడం వల్ల పంట ఇంటికి తెచ్చినపుడు ధర తక్కువగా ఉన్నా సరే బలవంతంగా అమ్మవలసి వస్తుంది. సాధారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల గోగుపైరు పెరుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఊరవేసిన గోగు తెప్పలపై మట్టిని వేయడం వల్ల నాణ్యత తగ్గి మార్కెట్ రేటు తక్కువగా ఉంటుంది. మార్కెట్‌లో అన్ని రకాల నారకు ఒకటే ధర పలకడం, నాణ్యతను బట్టి ధర లేకపోవడం, గోగునార తీసిన కర్రలను వంట చెరకుగా వాడకపోవడం,వాటికి ఇతర ప్రయోజనాలు లేకపోవడం గోగు పంటకు ప్రతిబంధకాలుగా ఉన్నాయి.
గోగు సాగు మెరుగుకు
శాస్తవ్రేత్తల సూచనలు
గోగు సాగుకు తీసుకోవాల్సిన చర్యలపై శాస్తవ్రేత్త ఎన్‌డిఆర్‌కె శర్మ వివరించారు. గోగునారను నిల్వ చేసుకునే గిడ్డంగులను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తేవాలి. అధిక దిగుబడినిచ్చి తక్కువ కాల పరిమితి కలిగి బెట్టను, చీడపీడలను తట్టుకునే వంగడాలను రూపొందించాలి. ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించి లేదా తగ్గించి గోగునార ఉత్పత్తులకు ప్రాముఖ్యత కల్పించాలి. గోగునార ఆధారిత చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలి. నార తీసిన గోగుకట్టెలకు విలువ పెంచే కాగితం పరిశ్రమలో లేదా కార్డ్‌బోర్డు పరిశ్రమలోగాని ఉపయోగంలోకి తేవాలి. గోగు కట్టెలను ఊరబెట్టనవసరం లేకుండా నేరుగా నార తీసే యంత్రాలను రూపొందించి రైతులకు అందుబాటులోకి తేవాలి. గోగు కట్టెల ఊరవేతకు తక్కువ నీరు, తక్కువ సమయం బట్టి సాంకేతిక పరిజ్ఞానంపై ప్రాచుర్యం కల్పించాలి. గోగు నార ఉత్పత్తులకు విలువను జోడించే పరిజ్ఞానాన్ని ప్రాచుర్యం కల్పించాలి. గోగు పంట ఉత్తర కోస్తా జిల్లాలో చిన్న సన్నకారు రైతుల కమతాలలో వర్షాధార పంటగా సాగవుతుంది.
వివిధ మార్గాల ద్వారా ఈ పంటకు ప్రోత్సాహం కల్పిస్తే ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. గ్రామీణ విత్తన పథకం ద్వారా రైతులు గోగు విత్తనాన్ని తయారు చేసి అక్కడ రైతులకు అందజేయడం దీనివల్ల రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. విత్తన శుద్ధి పాటించడం, సిఫార్సు చేసిన ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడల యాజమాన్యం ద్వారా ఉత్పాదకతను పెంపుదల చేయాలి.

భక్తిశ్రద్ధలతో ‘గోపూజ’
విజయనగరం(పూల్‌బాగ్), జనవరి 15: పట్టణంలోని టిటిడి కళ్యాణమండపంలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయప్రాంగణంలో ఆదివారం గోపూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోమాతకు పసుపు కుంకుమలను రాసి బంతి చామంతి దండలతో గోమాతను అలంకరించారు. భక్తులు గోమాత చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ జరిపారు. ఈ సందర్భంగా టిటిడి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్యామసుందరం మాట్లాడుతూ టిటిడి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కేంద్రంలో గోపూజకార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున మండల కేంద్రాల్లో గోపూజా కార్యక్రమాన్ని జరిపామని చెప్పారు. సనాతనమైన మనధర్మాలను తెలియచెప్పేందుకు టిటిడి దేవస్థానములు ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామివారి ఆలయ అర్చకులు నరసింహాచార్యులు గోపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
చైతన్య దీపికలు ‘దినపత్రికలు’
విజయనగరం(పూల్‌బాగ్),జనవరి 15: తెలుగుదినపత్రికలు చైతన్యదీపికలని తెలుగు వెలుగు సంస్థ వ్యవస్థాపకుడు మక్కువ చంద్రకళాధర్ అన్నారు. ఆదివారం సంస్థ కార్యాలయంలో తెలుగు దినపత్రికలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాధర్ మాట్లాడుతూ సమాజ హితం కోసం ఎందరో పాత్రికేయులు తమ సర్వస్వాన్ని ధారపోసారని అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో పత్రికలు నిర్వహించిన పాత్ర అమోఘమైనదని పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ, సమాజాన్ని సన్మార్గం వైపుకు నడిపేవి పత్రికలని చెప్పారు. విద్యార్ధులు దినపత్రికలను చదివే అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
అయ్యప్పస్వామికి విశేష పూజలు
విజయనగరం(పూల్‌బాగ్),జనవరి 15: పట్టణంలోని ఉడాకాలనీలో ఉన్న అయ్యప్పస్వామి వారి ఆలయంలో శనివారం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకపూజలు జరిపారు. ఈ సందర్భంగా వేకువజామున స్వామివారికి నిత్యపూజలనంతరం పంచామృతాభిషేకం, సహస్రనామ పుష్పార్చన కార్యక్రమాలను నిర్వహించారు. 18మెట్లతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉడాకాలనీ, బొబ్బాదిపేట, గోకపేట,పాల్‌నగర్ ప్రాంతాలనుండి భక్తులు తరలివచ్చి పూజలు జరిపించుకున్నారు. ఈసందర్భంగా గురుస్వామి సాయిబాబా మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం రోజున ఈపూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈపూజాకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇగ్నోలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం(పూల్‌బాగ్), జనవరి 15: పట్టణంలోని పూల్‌బాగ్‌లో ఉన్న మహారాజా పిజి కళాశాలలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం( ఇగ్నో) 2017కు గాను మాస్టర్స్, పిజి డిప్లమోలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కళాశాల సంచాలకులు ఐ,్భస్కరరెడ్డి తెలిపారు. ధరఖాస్తుదారులు తమ ధరఖాస్తులను అందచేయడానికి ఈనెల 16వ తేది వరకు గడువు ఉందని చెప్పారు. ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యు, ఎంఏ ప్రోగ్రామ్స్‌లలో 15 సబ్జెక్టులకు, బి ఏ బికాం, బిఎస్‌సి ఫిజిక్స్ , కెమిస్ట్రీ, మేధ్స్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మరిన్ని వివరాలకు కళాశాలలో ఇగ్నో కో ఆర్డినేటర్ డాక్టర్ సాయికుమార్‌ను సంప్రదించాలని కోరారు.