విజయనగరం

సక్రమంగా పనిచేయకపోతే చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జనవరి 20: సక్రమంగా పనిచేయకపోతే చర్యలు తప్పవని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ ఆశాజ్యోతి హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఉద్యోగులను ఆమె ఆదేశించారు. ప్రధానంగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇఆర్‌పి, పురయాప్‌లపై విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. మున్సిపాలిటీలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు సక్రమంగా పనిచేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బాధ్యతల నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించే ప్రసక్తిలేదని తెలిపారు. ప్రతీనెల జీతాలు తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ సేవలు అందించవలసిందేనని ఆమె స్పష్టం చేశారు.
మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగులు సమయపాలన పాటించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా కార్యాలయానికి వచ్చి హాజరు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు ప్రసాద్, మత్స్యరాజు, మున్సిపల్ మేనేజర్ ఆనందరావు, జూనియర్ అకౌంట్స్ అధికారి ఆర్‌ఎస్‌ఆర్ కిరణ్, అకౌంటెంట్ నరసింగరాజుతోపాటు పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి
* ఎమ్మెల్యే మీసాల గీత

విజయనగరం (్ఫర్టు), జనవరి 20: రోడ్డుప్రమాదాల నివారణపై ప్రజలలో మరింత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. 28వ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుప్రతిలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. రహదారి భద్రత నియమాలను, నిబంధనలను పాటిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని అన్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కార్పోరేట్ ఆసుపత్రుల స్థాయి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఉప రవాణా కమిషనర్ భువనగిరి శ్రీకృష్ణవేణి మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రహదారి భద్రత నియమాలపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్లు మురళీకృష్ణ, దుర్గాప్రసాద్, రమేష్, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు