విజయనగరం

అతీగతీలేని విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జనవరి 21: మున్సిపాలిటీలో ఎన్‌టిఆర్ భరోసా పథకం కింద అనర్హులకు పింఛన్లు మంజూరు చేస్తున్నారనే వచ్చిన ఫిర్యాదులపై విచారణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ జారీ చేసిన ఆదేశాలను మున్సిపల్ అధికారులు బేఖాతర్ చేశారు. మూడునెలల క్రితం కలెక్టర్ ఉత్తర్వులు జారీచేసినప్పటికీ ఇంతవరకు అతీగతీ లేదు. దీనిపై సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో ఎన్‌టిఆర్ భరోసా పథకం ఏడవ వార్డులో 34 మంది అనర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారని తెలుగుదేశంపార్టీ పట్టణ అధ్యక్షుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ గత ఏడాది అక్టోబర్ ఏడవ తేదీన జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణ నిర్వహించాలని డిఆర్‌డిఎ, వెలుగు ప్రాజెక్టు డెరెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ నాగరాజుకు ఆయన నివేదించారు. ప్రాజెక్టుడైరెక్టర్ నివేదించిన ఉత్తర్వుల మేరకు ఏడవ వార్డులో జరుగుతున్న పింఛన్ల పంపిణీపై విచారణ నిర్వహించి అనర్హుల జాబితాను రూపొందించాలని మున్సిపల్ మేనేజర్ ఆనందరావును కమిషనర్ ఆదేశించారు. మూడునెలలు గడుస్తున్నా అతీగతీ లేకపోవడంతో ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుకు దృష్టికి తీసుకువెళ్లాలని టిడిపి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ నిర్ణయించినట్లు తెలిసింది. పట్టణంలో ఏడవ వార్డులో 34 మంది పింఛన్‌దారులు పింఛన్ తీసుకోవడానికి అనర్హులని, వారి పింఛన్లు తొలగించాలని పింఛన్ కోడ్ నెంబర్‌తో సహా అన్ని వివరాలను జిల్లాకలెక్టర్ చేసిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఒకే రేషన్‌కార్డులపై రెండు పింఛన్లు, వయస్సు తక్కువగా ఉన్నవారికి, వికలాంగులు కానివారికి, ప్రభుత్వ పింఛన్‌దారులకు కూడా పింఛన్లను పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులో ఆయన తెలియజేశారు. అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్రంగా పరిగణించిన డాక్టర్ ప్రసాద్ కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

పోస్టల్ బీమా పథకంతో ధీమా
బొండపల్లి, జనవరి 21: గ్రామీణ ప్రాంత ప్రజలకు బీమా కట్టించేందుకు తపాల శాఖ గ్రామీణ జీవిత బీమా పథకం అమలు చేస్తున్నదని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా తపాలశాఖ అధికారి డి. ఆనందరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నూతన పొదుపు పథకాలు, గ్రామీణ తపాల చేపట్టే భీమాలపై మహా యోగా మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాలికల కోసం సువర్ణ అవకాశం కల్పిస్తూ సుకన్య-సమృద్ధి యోజన ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం వలన బాలికల భవిష్యత్తు మెరుగు పడుతుందన్న అంశాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షలు ఎస్‌బి ఖాతాలు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. సిబ్బంది పనితీరు మెరుగు పరచుకునేందుకే చక్కని అవకాశమని, తపాల శాఖ ఉద్యోగులంతా కృషి చేసి లక్ష్యాన్ని అధిగమించాలని కోరారు. ఈ సందర్భంగా అధిక మొత్తంలో నూతన ఖాతాలు ప్రారంభించి బ్రాంచీ పోస్టుమాస్టర్లను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. మెంటాడ మండలం జయితి బ్రాంచీ పోస్టుమాస్టార్ నాగభూషణరావుకు ప్రథమ స్థానం, గజపతినగరం మండలం లింగాలవలస బిపిఎం సంతోషికి ద్వితీయ స్థానం, దేవుపల్లి, బి.రాజేరు, కుంటినవలస బిపిఎంలు శ్రీదేవి, రమణమ్మ, బాలాజీ సత్కరించారు. కార్యక్రమంలో గజపతినగరం పోస్టల్ పర్యవేక్షణ అధికారి చంద్రశేఖరరావు, జె ఎస్‌టిలు శ్రీనివాసరెడ్డి, కృష్ణ, జగన్నాథంతోపాటు వివిధ గ్రామాల బ్రాంచి పోస్టుమాస్టార్లు, సిబ్బంది పాల్గొన్నారు.