విజయనగరం

ఘటనపై సమగ్ర విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 21: గంట్యాడ మండలంలోని గోస్తనీ నదిపై నిర్మించిన తాటిపూడి రిజర్వయర్ గేటులో ఒక గేటు పైకి లేచిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్టు కలెక్టర్ వివేక్‌యాదవ్ స్పష్టం చేశారు. శనివారం సంఘటన సమాచారం తెలుసుకున్న కలెక్టర్ అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ రిజర్వాయర్ గేటు మానవ తప్పిదం వల్లనే జరిగిందని అంచనా వేస్తున్నామన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు తాను ఆదేశించినట్టు తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో తాటిపూడి రిజర్వాయరుకు సంబంధించిన 4గేట్లులో నాలుగవ నంబరు గేట్ నుంచి 900 క్యూసెక్కుల నీరు వృథాగా కిందకి వెళ్లిపోయిందన్నారు. ఇదిలా ఉండగా రిజర్వాయర్‌కు దిగువన దుస్తులు ఉతుకుతున్న గమ్మెల తాడెమ్మ (34) నదిలో నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిందన్నారు. వంతాల భమాలమ్మ అనే మరో మహిళ సురక్షితంగా బయటపడిందన్నారు. కొట్టుకుపోయిన మహిళ భర్త దినసరి కూలీ అని ఆమెకు వికలాంగుడైన ఐదేళ్ల కుమారుడు ఉన్నాడని కలెక్టర్‌కు వివరించారు. కాగా, తీరం వెంబడి గల్లంతైన మహిళ కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
సమగ్ర దర్యాప్తు జరపాలి
తాటిపూడి జలాశయం నాల్గవ గేటు రోప్ తెగి పైకిలేచిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జెఎసి రాష్ట్ర చైర్మన్ లగుడు గోవిందరావు డిమాండ్ చేశారు. శనివారం తాటిపూడిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం సంభవించిందని అన్నారు. జలాశయం నిర్వహణ పనులు చేపట్టకపోవడం, సిబ్బంది కొరతతోపాటు జలాశయానికి సంబంధించిన కొన్ని సంవత్సరాల నుంచి దుర్వినియోగం అవుతుండడంవలనే అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ప్రమాదంపై సమగ్ర దర్పాప్తు జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.