విజయనగరం

సస్యరక్షణ చర్యలే చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 12 : ఉత్తరకోస్తావ్యవసాయ విస్తరణ సలహామండలి సంఘ సమావేశం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించింది. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాలనుండి పాల్గొన్న రైతులు ఖరీఫ్ సీజన్‌లో వివిధ పంటల సాగులో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. సస్యరక్షణ, అధికదిగుబడులు, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ రంగాల్లో రైతులు అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఆచార్య ఎం జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఎన్‌వి నాయడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సలహామండలి సభ్యుడు రామరాజు మాట్లాడుతూ మొక్కజొన్న, బొప్పాయి పంటల పరిశోధన కేంద్రం అవసరమని రస్తాకుంటుబాయి కేంద్రం సుదూరంగా ఉందని విజయనగరం డివిజన్‌లో పరిశోధన స్థానం ఏర్పాటు చేయాలని కోరారు. యాంత్రీకరణ పరికరాల మరమ్మతులకు తగు సౌకర్యాలు కల్పించాలని రసాయన, ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయ విధానాలలో ఏది సమగ్రంగా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందో అధికారులు సరైన దిశానిర్థేశం చేయాలని కోరారు. మెరకముడిదాం మండలానికి చెందిన రైతు లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ మామిడి, జీడిమామిడిలో సస్యరక్షణ చర్యలు అవగాహన కల్పించాలని సూచించారు. రైతు మురళీకృష్ణ మాట్లాడుతూ గోగు, వేరుసెనగ విస్తరణ అవసరాన్ని గుర్తు చేస్తూ మినుగులు పంటవలన రైతులు లాభాలు చూసారని గుంటూరు వెరైటీ సరఫరా చేయాలని కోరారు.
ఆమదాలవలసకు చెందిన చెరకు రైతు ముద్దాడ కృష్ణారావు మాట్లాడుతూ తగిన మార్కెటింగ్ సదుపాయం లేక రైతు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేసారు. మొక్కజొన్న సాగులో మేలైన విత్తనాల సస్య రక్షణను రైతులకు అందించాలని డెంకాడకు చెందిన రైతు ఫణిరాజు సూచించారు. బుడతనాపల్లికి చెందిన రైతు మల్లునాయుడు మాట్లాడుతూ మెట్టు భూములు రియల్ వ్యాపారంగా మారుతున్నాయని, అపరాల సాగువైపు ప్రభుత్వం ప్రోత్సహించాలని అన్నారు. అనకాపల్లికి చెందిన కర్రి జోగినాయుడు మాట్లాడుతూ చిరు ధాన్యాల ఉత్పత్తి, ప్రోసెసింగ్ అనుబంధ ఉత్పత్తులపై అవగాహన పెంచాలని తెలిపారు. భీమసింగి చక్కెర కర్మాగారం కెపాసిటీ పెంచాలని, చెరకు పంటకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని కోరారు. ఈ సమావేశంలో రైతుల సందేశాలకు వ్యవసాయ అనుబంధ అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన క్యాలెండర్‌ను కలెక్టర్ ఎం ఎం నాయక్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలోవ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు లీలావతి విజయనగరం, రామారావు శ్రీకాకుళం, సత్యనారాయణమూర్తి విశాఖపట్నం, ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్లు రామారావు, ప్రమీల, లక్ష్మణదాస్, విజయనగరం ఉద్యాన శాఖ డిడి రామ్మోహన్, పశుసంవర్థక శాఖ జెడి సింహాచలం, అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడి ఎన్ వేణుగోపాలరావు, శాస్తవ్రేత్త లక్ష్మి, వ్యవసాయాధికారులు, రైతులు, ఏరువాక కేంద్రం అధికారులు పాల్గొన్నారు.