విజయనగరం

మరుపల్లిలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జనవరి 24: మండలంలోని మరుపల్లి గ్రామంలోని పడాలవీధిలో మంగళవారం తెల్లవారుజాము రెండు గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 పూరిళ్లు కాలిపోగా ఆరు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని అధికారుల అంచనా. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దుక్క సత్యం ఇంటి వద్ద మంటలు ప్రారంభం కాగా కాల్చి పారవేసిన సిగరెట్‌తో ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు అంటున్నారు. ఈ ప్రమాదంలో సత్యం ఇంటితోపాటు కొర్నాన రాము, దేవర అప్పన్న, సమ్మ సింహాచలం, గడిదేశి అప్పన్న, రమణ, దమనేని సత్యం, మల్లెల లక్ష్మణ, దేవర చినరామన్న, మక్కా నారాయణ, కర్రి సన్యాసి, జాడ నారాయణ, పెంటన్నల ఇళ్లు దగ్ధమయ్యాయి. చినరామన్న, సమ్మా సింహాచలం, దుక్క సత్యంకి చెందిన 30బస్తాల ధాన్యం, నమ్మి సింహాచలానికి చెందిన 50వేల రూపాయల నగదు, పది తులాల వెండి పట్టీలు కాలి బూడిదయ్యాయి. కాలిన ఇళ్లన్నీ పూరిళ్లు కావడంతో బాధితులకు కట్టు బట్టలు మినహా ఏమీ మిగలలేదు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి మహేశ్వరరావు సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఆదుకుంటాం- ఆర్డీఓ
అగ్ని బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని విజయనగరం ఆర్డీఓ శ్రీనివాసమూర్తి అన్నారు. మంగళవారం మరుపల్లి అగ్ని బాధితులను పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. తక్షణమే బాధితులకు బియ్యం అందించాలని తహశీల్దార్ మసీలామణిని ఆదేశించారు. ప్రమాద సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించినందున ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన మూడు ప్రమాదాలలో పలువురు మృతి చెందారని తెలిపారు. అదే విధంగా మండల పరిషత్ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, జడ్పీటీసి మక్కువ శ్రీధర్‌లు బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపిపి శ్రీదేవి మాట్లాడుతూ బాధితులు అందరికీ ఇళ్లు మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బాధితులకు ఐదు కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఎంపిపి శ్రీదేవి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ ఐ వెంకటరావు, గ్రామ సర్పంచ్ గెద్ద దమయంతి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 70వేల పాడి పశువులకు వ్యాక్సిన్లు
గజపతినగరం, జనవరి 24: జిల్లాలోని 70వేల పాడి పశువులకు ఉచితంగా వ్యాక్సిన్‌లు వేయిస్తున్నామని విశాఖ డెయిరీ మేనేజర్ రెడ్డి వరప్రసాద్ అన్నారు. మంగళవారం గజపతినగరం పంచాయితీ శివారు ఎం.వెంకటాపురం పాలసేకరణ కేంద్రం వద్ద పాడి రైతు భీమా 50వేల రూపాయల చెక్కును మేనేజర్ ప్రసాద్ భర్త పైడిరాజుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 250 రూపాయల విలువగల వ్యాక్సిన్‌లు ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. అదే విధంగా ఏలిక పాముల నివారణ మందు 50 శాతం రాయితీపై అందజేస్తున్నామని చెప్పారు. గోపాల రక్ష పథకం కింద పాడి రైతులు 450 రూపాయలు ప్రతీ ఏడాది బీమా చేయిస్తే భార్యభర్తలకు 50 వేల రూపాయల వంతున, పశువులకు 30వేల రూపాయలు, పాడి రైతుల పిల్లలు ఇద్దరికి ఉపకార వేతనాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. సూపర్‌వైజర్ రామకృష్ణ మాట్లాడుతూ బోడసింగిపేట గ్రామానికి చెందిన సాదిబిల్లి సూర్యకాంతం ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందగా ఇందుకు సంబంధించిన బీమా మొత్తం 50వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందని అన్నారు. అదే విధంగా పాడి పశువును కోల్పోయిన బాధితురాలు ఆదిలక్ష్మికి 30వేల రూపాయల బీమా నగదును అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇడిదిల శ్యామల, బండారు శ్రీనివాసరావు, సూపర్‌వైజర్ నాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు.