విజయనగరం

చురుగ్గా ఎయిర్‌పోర్టు భూ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 28: జిల్లాలోని బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతంర్జాతీయ విమానాశ్రయాని స్బంధంచి ఇప్పటి వరకు 1250 ఎకరాల భూమిని సేకరించామని ఇందుకోసం రూ.300 కోట్లు నిర్వాసితులకు చెల్లించినట్టు తెలిపారు. భూసేకరణలో నిర్వాసితులైన 376 కుటుంబాలకు సహాయ పునరావాసం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాదిలో విమానాశ్రయ పనులు ప్రారంభించే అవకాశం ఉన్నందున రెవెన్యూ, సర్వే, ఆర్ అండ్ బి, అటవీశాఖ తదితరశాఖల సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. స్వచ్చందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులకు భూముల విలువకు సంబంధించి అధికారులతో చర్చించారు. భూములు ఇవ్వడానికి ముందుకు రాని వారికి నోటీసులు జారీ చేసి వారికి రెండు నెలల్లో నష్టపరిహారం చెల్లించాలన్నారు. డి పట్ట్భాములు, పివోటి కేసులు ఉన్నవాటికి నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోవాలన్నారు. సేకరించిన భూములను సమగ్ర వివరాలతో విమానాశ్రయ అథారిటీకి అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బోగాపురం ఎయిర్‌పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, ఎస్‌డిసిలు అనిత, శ్రీలత, బాలత్రిపురసుందరి, సర్వే ఎడి బి.సూర్యనారాయణ, బోగాపురం తహశీల్దార్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అద్దె బస్సులు సక్రమంగా నిర్వహించకుంటే
అపరాధ రుసుం తప్పదు
* డిసిఎంఇ రామకృష్ణ
బొబ్బిలి, జనవరి 28: ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ సక్రమంగా లేకుంటే యజమానులకు అపరాధ రుసుం విధిస్తామని ఆర్టీసీ నార్త్, ఈస్ట్‌కోస్టు డిప్యూటీ కంట్రోల్ మెయింటినెన్స్ ఇంజనీర్ సిహెచ్. రామకృష్ణ హెచ్చరించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అద్దె బస్సులను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఆర్టీసి పరిధిలో 287 అద్దె బస్సులను తిప్పుతున్నామన్నారు. వీటి నిర్వహణ పట్ల ఆ యజమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బస్సులకు మరమ్మతులకు గురైన లేదా చిన్నచిన్న ఇబ్బందులున్న ఆయా కండక్టర్లు ఎస్‌ఆర్‌లో నమోదు చేసి డిపోమేనేజర్‌కు విషయాన్ని తెలియజేయాల్సి ఉందన్నారు. బస్సులు ఎటువంటి మరమ్మతులకు గురైన వెంటనే బాగు చేయించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆర్టీసి డ్రైవర్లకు ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. 40 ఏళ్లుదాటిన డ్రైవర్లను గ్యారేజిలోనే పని కల్పిస్తామన్నారు. ఏడాదికి 3 పర్యాయాలు వైద్యతనిఖీలు నిర్వహిస్తామన్నారు. 40 ఏళ్లు దాటిన డ్రైవర్లుకు ఏడాదికొకసారి వైద్యతనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రయాణీకులను భద్రంగా గమ్యస్థానాలకు చేర్చడమే ధ్యేయమన్నారు. ఆర్టీసి కాంప్లెక్స్‌ను ఆదునీకరించి ప్రయాణీకుల అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. రెండు జిల్లాల పరిధిలో ఆర్టీసి బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని మరమ్మతులకు గురైన వాటిని నిలుపుదల చేస్తున్నామన్నారు. ప్రయాణీకులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

ఎంపి నిధులతో సామాజిక అభివృద్ధి
* కేంద్రమంత్రి అశోక్
విజయనగరం(టౌన్), జనవరి 28: విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంపి కోటా నిధులతో చేపట్టిన వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను పెందుర్తి శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తికి కేంద్ర మంత్రి అశోక్ వివరించారు. తన కూతురు వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను కేంద్ర మంత్రికి అందచేసేందుకు శనివారం బండారు సత్యనారాణమూర్తి విజయనగరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తన నియోజకవర్గంలో ఎంపి ల్యాడ్ నిధులతో అమలుచేసిన సామాజిక అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన ఫ్లెక్సీని చూపించారు. ఫ్లెక్సీలో పొందుపరిచిన వివరాలు ఆయనకు అశోక్ స్వయంగా వివరించారు. పట్టణ శివారు పూల్‌భాగ్‌లోని ప్రేమసమాజంలో సేంద్రీయ ఎరువులు వినియోగించి పండిస్తున్న కూరగాయల సాగును ఆయనకు చూపించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన సౌరవిద్యుత్తు వ్యవస్ధను పరిశీలించారు. కేంద్ర మంత్రి అమలుచేస్తున్న అభివృద్ధికార్యక్రమాలు, ఎంపి నిధుల సద్వినియోగం, ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న పనులు తెలుసుకున్నారు. ఈసందర్భంగా బండారు సత్యనారాయణమూర్తికి ప్రేమ సమాజంలో సేంద్రీయ ఎరువులతో పండించిన క్యాబేజి పువ్వుబుట్టను బహూకరించారు. ఈపర్యటనలో ఆయన వెంట టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ, కెత్రిమూర్తులురాజు,పార్టీ నాయకులు బలివాడ అప్పారావు, వెంకటఅప్పారావు, పైడిరాజు, పేరిరామయ్యపంతులు తదితరులు పాల్గొన్నారు.

గరం...గరం!
* మున్సిపల్ సమావేశంలో సభ్యుల ఆగ్రహం
విజయనగరం (్ఫర్టు), జనవరి 28: పట్టణంలో సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం శ్రద్ద చూపడంలేదని కౌన్సిల్‌సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావుఅధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై సభ్యులు ఏకరవుపెట్టారు. అధికార పార్టీకి చెందిన సభ్యులే సమస్యలపై మొరపెట్టుకోవడంతో ప్రతిపక్షసభ్యులు విస్తుపోయారు. తన వార్డు పరిధిలో ఎటువంటి అభివృద్ధిపనులు జరగడంలేదని, ప్రతిపక్షసభ్యుడిని కాదని, టిడిపి కౌన్సిలర్‌నని 37వ వార్డు కౌన్సిలర్ కంది మురళీనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ప్రతిపాదించిన పనులు కూడా ఇంతవరకు ప్రారంభించలేదని, వార్డుపరిధిలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ కుర్చీలో కూర్చోకుండా నిరసన తెలియజేస్తానని హెచ్చరించారు. ఒకే కాంట్రాక్టర్‌కు అన్ని పనులు అప్పగించడం వల్ల జరగడంలేదని, రెండు, మూడు లక్షల రూపాయల పనులు కూడా జరగడంలేదని తెలిపారు. దీనిపై జోక్యం చేసుకున్న వైస్‌చైర్మన్ మురళీమోహనరావుమాట్లాడుతూ పనులు జరిగే చూస్తామని హామీ ఇవ్వడంతో తనకు కేటాయించిన కుర్చీలో మురళీనాయుడు కూర్చున్నారు. అదేవిధంగా వ్యక్తిగత నిర్మాణాలపై కూడా సభ్యులు గళం విప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. పట్టణంలోని అభివృద్ధి పనులపై 4,6,11,12,14,16,17,21,23,24,31,32,36,39 వార్డులకు చెందిన కౌన్సిలర్లు కిల్లాన పార్వతి, ఎస్‌వివి రాజేశ్వరరావు, చెన్నా రూపవాణి, పిలకాదేవి, సుంకరి విజయలక్ష్మి, రౌతు పద్మ, ఆదుర్తి వాసుదేవ్, గేదెల ఆదినారాయణ, మేకా అనంతలక్ష్మి, రొంగలి రామారావు, కొర్నాన రాజ్యాలక్ష్మి, గాడు అప్పారావు, కెల్ల వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మెప్మా ద్వారా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం విడుదల చేసిన మూడువేల రూపాయలు అందడంలేదన్నారు. పట్టణంలో కొన్నిచోట్ల మున్సిపల్ స్థలాలు ఆక్రమణలకు గురవుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమిచేస్తున్నారో అర్థం కావడంలేదని 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావువిమర్శించారు. అనంతరం మున్సిపల్ అజెండాలో పొందుపర్చిన అనేక అంశాలపై చర్చించారు. పట్టణంలో మంచినీటి సరఫరాకు సంబంధించి సమ్మర్ కంటింజెన్సీ ప్లాన్‌పై ఆరవ వార్డు కౌన్సిలర్ రాజేష్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల వైఖరిని తప్పుపట్టారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ కనకమహాలక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు ప్రసాద్, మత్స్యరాజు, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శోభన్‌బాబు, హరిదాసు, మున్సిపల్ మేనేజర్ ఆనందరావు, పర్యావరణ ఇంజనీర్ సంతోషికుమారి, మెప్మా ప్రాజెక్టు అధికారి సరోజిని తదితరులు పాల్గొన్నారు.
హోదాపై కప్పదాట్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో
రాష్ట్రం అధోగతి
ఏ జిల్లాకు ఎన్ని పెట్టుబడులో చెప్పాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయనగరం (్ఫర్టు), జనవరి 28: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటులో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ద్వంద్వవైఖరిని అవలంభిస్తున్నాయని సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సామాజిక న్యాయ శంఖారావంలో భాగంగా శనివారం సాయంత్రం కోట జంక్షన్ వద్ద జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకటయ్యనాయుడు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అవసరం లేదంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇద్దరు నాయుడుల వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందపర్చిన అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆరులక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఆరువేల కోట్ల రూపాయలకు మించి పెట్టుబడులు రాలేదన్నారు. ఏఏ జిల్లాలకు ఎంతెంత పెట్టుబడులు వచ్చాయో ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగాలంటే కేంద్రం ఆదుకోవలసిందేనని రామకృష్ణ అన్నారు. శ్రీకృష్ణ కమిషన్ కూడా ఇదే అంశాన్ని సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందని, అందువల్ల బుందేల్‌ఖండ ప్యాకేజీ మాదిరిగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. జిల్లాకు 50 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అందించడం వల్ల ఒరిగిందేమి ఉండదని చెప్పారు. దీని వల్ల అభివృద్ధి జరగదన్నారు. చట్టబద్ధత లేని ప్యాకేజిల్ల ప్రయోజనమేమి ఉండదని అన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం లేదని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ఒక కొలిక్కి రాలేదని, ఆంధ్రప్రదేశ్ నుంచి రైల్వేమంత్రి సురేష్‌ప్రభును రాజ్యసభ్యుడిగా ఎంపిక చేసినప్పటికీ రాష్ట్రానికి ఒరిగిందేమి లేదన్నారు. రైల్వేజోన్ రాకపోయినా..రైళ్లు మాత్రం పడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దుర్గ్భావాని, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ, దళిత హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఆకుల కిశోర్, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు కెవి ప్రసాద్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు