విజయనగరం

స్వగ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తిరాజేరు, జనవరి 30: తను జన్మించిన స్వగ్రామానికి ప్రతి ఒక్కరు ఎంతో కొంత అభివృద్ధికి సహకరించాలని లయన్స్ జిల్లా గవర్నర్ వి. ఎస్. నూకరాజు అన్నారు. సోమవారం మండలంలోని టి.బూర్జివలస గ్రామంలో లెగేసీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గజపతినగరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జగదీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గవర్నర్ నూకరాజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ లయన్స్ జిల్లా గవర్నర్ డాక్టర్ బి.ఎస్.ఆర్. మూర్తి స్వగ్రామమైన టి.బూర్జివలసలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డాక్టర్ మూర్తి పూర్తి సహకారం అందించారని అన్నారు. అలాగే గ్రామంలో యుపి పాఠశాల నిర్మాణానికి, అంగన్వాడీ పాఠశాల నిర్మాణానికి, మధ్యాహ్న భోజన పథకం భవన నిర్మాణం, గ్రంథాలయ నిర్మాణంతోపాటు ప్రహరీ నిర్మాణానికి ఉచితంగా స్థలం వితరణ చేసిన డాక్టర్ బి. ఎస్. ఆర్.మూర్తి అభినందనీయులని, మున్ముందు గ్రామాభివృద్ధికి మరింత సహకరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మంత్రి అప్పలనాయుడు డాక్టర్ బి.ఎస్.ఆర్.మూర్తి జిల్లాలో చేసిన సేవలను కొనియాడుతూ గ్రామానికి తన వంతు అభివృద్ధి పనులకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ధన్యవాదాలు తెలిపారు. లయన్స్ డాక్టర్ బి. నాగనరేంద్ర ఆధ్వర్యంలో జిల్లా లయన్స్ గవర్నర్ నూకరాజు, బి. ఎస్. ఆర్.మూర్తి, లయన్స్ సభ్యులు పి.నాగేశ్వరరావులతోపాటు లయన్స్ సభ్యులు పేదలకు దుప్పట్లు,చీరలు పంపిణీ చేశారు.
అసాంఘిక కార్యక్రమాల నిరోధానికి మైత్రీ పోలీసు
బొండపల్లి, జనవరి 30: గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు సహకారం అందించేందుకు మైత్రీ పోలీసు ఏర్పాటు చేస్తున్నామని ఎస్సై సుదర్శన్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని 26 గ్రామ పంచాయితీలలో సుమారు 234 మంది చురుకైన యువకులను ఎంపిక చేసామని తెలిపారు. పోలీసు సిబ్బందితోపాటు మైత్రీ పోలీసుల సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుందని చెప్పారు. గ్రామాలలో జూదం, కోడిపందాలు, క్రికెట్ బెట్టింగ్‌లతో గ్రామదేవతల పండగలలో మైత్రీ పోలీసు సేవలను వినియోగించుకోవడం జరుగుతుందని అన్నారు. మైత్రీ పోలీసు యువకులకు డ్రెస్‌కోడ్ ఉంటుందని చెప్పారు. కాగా మైత్రీ పోలీసు కోసం గుర్తించిన యువకుల జాబితాను జిల్లా ఎస్పీకీ పంపడం జరిగిందని తెలిపారు.