విజయనగరం

నీటి వృథా నివారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 4: వేసవిలో విజయనగరం పట్టణ వాసులకు తాగునీటి ఎద్దడి లేకుండా నివారించాలని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ సాగునీటి అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం పట్టణానికి తోటపల్లి, గడిగెడ్డ రిజర్వాయర్ల ద్వారా నిరంతరం నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రౌతు సత్యనారాయణతో కలసి ఆయన సమీక్షించారు. తోటపల్లి ప్యాకేజీ 1, 2 పనులు ఎంత వరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. చీపురుపల్లి నుంచి గరివిడి, గుర్ల, మెరకముడిదాం, దత్తిరాజేరు మండలాలకు సంబంధించి 97.7 కిలోమీటర్ల సాగునీటి కాలువ పనులు వేగవంతం చేయాలన్నారు. విజయనగరం పట్టణానికి గడిగెడ్డ రిజర్వాయరు ద్వారా తాగునీరు అందించేందుకు గల అవకాశాలపై ఆయన సమీక్షించారు. గడిగెడ్డ రిజర్వాయరు ద్వారా చంపావతి నదిలో నీటి నిల్వ, వృధాగా పోతున్న నీరు నిల్వచేసేందుకు అవకాశాలపై సమీక్షించారు. వృథాగా పోతున్న నీటిని అరికట్టి విజయనగరం వాసులకు తాగునీరు అందించాలన్నారు. ఈ ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టు నమూనా అంశాలపై కన్సల్టెంట్ రౌతు రాకేష్ కలెక్టర్‌కు వివరించారు. విజయనగరం పట్టణానికి తాగునీరు అందించే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో తోటపల్లి ప్రాజెక్టు ఎస్‌ఇ తిరుమలరావు, ఇఇ రామచంద్రరావు, చిన్న తరహా సాగునీటిపారుదల ఇఇ ఎంవి రమణ, ఇంజనీర్లు పాల్గొన్నారు.
చెరకు విస్తీర్ణంతోనే ఫ్యాక్టరీ మనుగడ
జామి, ఫిబ్రవరి 4: చెరకు విస్తీర్ణంపైనే ఫ్యాక్టరీ ఆధారపడి ఉంటుందని రాష్ట్ర చక్కెర కమిషనర్ మురళీ అన్నారు. శనివారం భీమసింగి సహకార చక్కెర కర్మాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమసింగి గతంలో రెండు లక్షల టన్నుల క్రషింగ్ చేసే సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం కనీసం లక్ష టన్నుల చెరకు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోకపోవడంపై వ్యవసాయ విభాగం అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మనుగడపై దృష్టిసారించకుండా ఎవరి డిమాండ్లు వాళ్లు తెలియజేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీని సక్రమంగా నడుపుకోగలిగినపుడే అందరి డిమాండ్లు నెరవేరతాయన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సమస్యలపై దృష్టిసారించి వారితో మమేకం కావాలన్నారు. ప్రస్తుతం పంచదార రేటు ఆశాజనకంగా ఉందన్నారు. కిలో రూ.35 నుంచి రూ.45 వరకు అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా చెరకు అభివృద్ధి తగ్గిందన్నారు. చెరకు పండించే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పంట తగ్గిపోయిందన్నారు. మన రాష్ట్రంలో పది శాతం వరకు వర్షాభావ కారణంగా దిగుబడి తగ్గిందన్నారు. రాష్ట్రంలో 29 చెరకు ఫ్యాక్టరీలకుగాను 18 ఫ్యాక్టరీలు నడుస్తున్నాయని, వాటిలో నాలుగు సహకార చక్కెర కర్మాగారాలు కాగా, 14 ఫ్యాక్టరీలు ప్రైవేటు రంగంలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇంత వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ జరగ్గా 28 లక్షల క్వింటాళ్ల పంచదార ఉత్పత్తి చేయగలిగామన్నారు. 9.1 శాతం రికవరీ వచ్చిందన్నారు. భీమసింగి ఫ్యాక్టరీకి సంబంధించి రైతులకు, సిబ్బందికి ఎటువంటి బకాయిలు లేకుండా చెల్లింపులు జరపడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించాలన్నారు. కొత్త రకం వంగడాలు, వాటి దిగుబడులపై వివరించి చెరకు ప్లాంటేషన్‌ను రైతులు వేసేలా వారిలో ఆసక్తి కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటరావు, ఫ్యాక్టరీ ఎండి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.