విజయనగరం

పోలీసులపై ఆటోడ్రైవర్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 6: విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో ఆటోడ్రైవరు దాడి చేసిన సంఘటనలో ఒక హోంగార్డు, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. రెడ్డిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో హోంగార్డు బి.అప్పలరాజు, కానిస్టేబుల్ చిప్పాడ అశోక్‌కుమార్‌లు ఆటో వద్ద ఉన్న వ్యక్తిని వివరాలు అడగ్గా వాళ్లమీద అతను చాకుతో దాడి చేశాడు. ఈ సంఘటనలో హోంగార్డు అప్పలరాజుకు మెడపై తీవ్రంగా గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌కు కూడా గాయమైంది. దీంతో వీరిని విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతున్నారు.

ఉత్తమ వైద్యసేవలకు అప్నాకు గుర్తింపు
విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 6: ఎపి ప్రైవేటు నర్సింగ్ హోం అసోసియేషన్ విజయనగరం శాఖ మూడవ సారి ఉత్తమ వైద్య సేవలకు అవార్డు దక్కించుకుంది. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఈమేరకు అవార్డును తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర అద్యక్షుడు సి ఎస్ మూర్తి నుండి అప్నా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వి ఎస్ ప్రసాద్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ వైద్య సేవలు అందించడమే కాకుండా దత్తత గ్రామం వసాదిలో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి అక్కడ ప్రజలకు మంచి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమం, వైద్య కార్యక్రమాలలో తమ వంతు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఈ సేవలను గుర్తించి మూడవ సారి ఉత్తమ అప్నా అధ్యక్షునిగా తనకు అవార్డు రావడం సంతోషదాయకమని చెప్పారు. మరింతగా వైద్య సేవలు ప్రజలకు అందిస్తామని అన్నారు.