విజయనగరం

పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, ఫిబ్రవరి 13: పల్లెల్లో పరిసరాల పరిశుభ్రతే థ్యేయంగా అధికారులు పనిచేయాలని ఎంపిడిఓ ఎం. ప్రకాశరావు అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వివిధ మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు నియమించబడిన ప్రత్యేక అధికారులు ఆయా గ్రామాలలో పర్యటించి లబ్దిదారులు వ్యక్తిగత మరుగుదొడ్లను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి స్ర్తినిధి ద్వారా అడ్వాన్సు రుణాలు అందజేస్తున్న విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న 15వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మార్చి నెలాఖరులోగా లక్ష్య సాధనకు అధికారులు అంకిత భావంతో పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో పంచాయితీ రాజ్ జెఇ అప్పలనాయుడు, ఎపిఎం పెంటంనాయుడు, నీటిపారుదల శాఖ ఎఇఇ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ తరగతులపై టీచర్లకు అవగాహన
గజపతినగరం, ఫిబ్రవరి 13: డిజిటల్ తరగతులపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించుకోవాలని కెయాన్ సంస్థ ప్రతినిధి పి. సాయికృష్ణ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో డిజిటల్ తరగతులపై ఉపాధ్యాయులకు ఒక్కరోజు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజపతినగరం, మరుపల్లి గ్రామాలలోని హైస్కూళ్లకు మూడేసి వంతున డిజిటల్ తరగతులు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. తెలుగు, హిందీ సబ్జెక్టులు తప్పా మిగిలిన సబ్జెక్టులపై ఉపాధ్యాయులకు ఏవిధంగా బోధించాలో సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎన్. జ్యోతి, యశోధ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.