విజయనగరం

గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదులపై చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 14: పట్టణంలో సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ప్రజలు సమర్పించుకుంటున్న వినతులపై స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలు, వినతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆయా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా మున్సిపల్ అధికారులలో ఏమాత్రం చలనం కనిపించడంలేదు. సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నా కనీసం పట్టించుకోవడంలేదు. సాక్షాత్తు జిల్లాకలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఒక్క ఫిర్యాదు కూడా పరిష్కారం కాలేదంటే మున్సిపల్ యంత్రాంగం పనితీరు ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని పట్టణ ప్రజలు వాపోతున్నారు. మున్సిపాలిటీలో ఇంతవరకు 4,451 అర్జీలు రాగా, ఇందులో 3,683 అర్జీలు పరిష్కారమయ్యాయి. ఇంకా పరిష్కరించేందుకు 166 అర్జీలు గడువులో ఉండగా, 602 అర్జీలు గడువుదాటిపోయాయి. గడువుదాటిన అర్జీల పరిష్కారంలో మున్సిపల్ యంత్రాంగం కనీస చొరవ చూపడంలేదు. మొత్తం అర్జీలలో 82.75 శాతం మాత్రమే పరిష్కారమయ్యాయి. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌లో 1117 అర్జీలు రాగా, ఇందులో 700 అర్జీలను మాత్రమే పరిష్కరించారు. ఇంకా పరిష్కారానికి నోచుకోలేని అర్జీలలో 336 గడువుదాటిపోగా, 81 అర్జీలు గడువులో ఉన్నాయి.
కేవలం 62.76 శాతం అర్జీలు మాత్రమే పరిష్కారమయ్యాయి. కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో వచ్చిన సమస్యల పరిష్కారంలో మున్సిపల్ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తుండటంతో ప్రతిసోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే మున్సిపల్ గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే అర్జీదారుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి 28 అర్జీలు వెళ్లగా, ఇందులో ఎనిమిది మాత్రమే పరిష్కారమయ్యాయి. 20 అర్జీలు గడువు దాటిపోయాయి. వీటి పరిష్కారంపై కూడా మున్సిపల్ యంత్రాంగం ఏమాత్రం దృష్టి సారించడంలేదు. కేవలం 28.57 శాతం మాత్రమే అర్జీలను పరిష్కరించడం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే డయల్ యువర్‌కలెక్టర్ కార్యక్రమానికి 43 ఫిర్యాదులు అందగా ఒక ఫిర్యాదును కూడా పరిష్కరించలేదు. సమస్యల పరిష్కారంలో మున్సిపల్ యంత్రాంగం నిర్థేశించిన గడువులో ఐదు అర్జీలు ఉండగా, 38 అర్జీలు గడువుదాటిపోయాయి. జీరోశాతం పరిష్కారం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి గ్రామసభలలో 2,915 అర్జీలను ప్రజలు సమర్పించగా, 2,825 అర్జీలు పరిష్కారమయ్యాయి. ఇంకా గడువులో 54 ఉండగా, 36 అర్జీలు గడువుదాటిపోయాయి. 96.91 శాతం అర్జీలను పరిష్కరించి అధికారులు చేతులు ముడుచుకున్నారు. అదేవిధంగా సాధారణ సమస్యలకు సంబంధించి 273 అర్జీలను అధికారులు స్వీకరించగా కేవలం 132 అర్జీలను మాత్రమే పరిష్కరించారు. ఇందులో 23 గడువులో ఉండగా, 118 అర్జీలు గడువుదాటిపోయాయి. కేవలం 48.35శాతం మాత్రమే పరిష్కారమయ్యాయి. ఆన్‌లైన్‌లో 99 అర్జీలను సమర్పించగా 26 అర్జీలను మాత్రమే పరిష్కరించారు. ఇందులో గడువులో మూడు ఉండగా, 70 అర్జీలు గడువుదాటిపోయాయి. కేవలం 26.26 శాతం మాత్రమే ఆన్‌లైన్ సమస్యలు పరిష్కారమయ్యాయి. అర్జీల పరిష్కారానికి సంబంధించి మున్సిపల్ విభాగాల వారీగా పరిశీలిస్తే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో 387 అర్జీలు, ఇంజనీరింగ్ విభాగంలో 90, టౌన్ ప్లానింగ్‌లో 85, మున్సిపల్ రెవెన్యూ విభాగంలో 12, ఎస్టాబ్లిమేంట్‌లో ఏడు, మున్సిపల్ ప్రజారోగ్యవిభాగంలో 78 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికైనా అర్జీలు, వినతులు, సమస్యల పరిష్కారంలో మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.