విజయనగరం

ఆస్తిపన్ను వసూళ్లలో కానరాని పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 16: పట్టణంలో ఆస్తిపన్ను వసూళ్లు మందకొడిగా జరుగుతోంది. మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారుల నిర్లక్ష్యం వల్ల పన్నుల వసూళ్లు ముందుకు సాగడంలేదు. మున్సిపల్ కమిషనర్ నాగరాజు పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఏమాత్రం ప్రయోజనం కనిపించడంలేదు. పన్నుల వసూళ్లలో మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు తగినద శ్రద్ద చూపకపోవడంతో ఆస్తిపన్ను బకాయిలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన మొండిబకాయిల వసూళ్లు మున్సిపాలిటీకి గుదిబండగా మారింది. ప్రస్తుత అసెస్‌మెంట్‌దారుల నుంచి నుంచి పన్ను వసూలు చేయడంలో అశ్రద్ద వహిస్తున్న ఉద్యోగులు పట్టణ శివారు ప్రాంతాలతోపాటు పట్టణంలో కొత్తగా నిర్మితమైన భవనాలకు కూడా పన్నులు వేయడంలో తీవ్ర నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తున్నారు. పాత బకాయిలతో కలిపి 32.47 కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూలు కావలసి ఉండగా ఇంతవరకు 10.28 కోట్ల రూపాయల పన్నులు వసూలు జరిగింది. పాత బకాయిలను మినహాస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 17 కోట్ల రూపాయలను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇంతవరకు 7.8 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేశారు. గత నవంబర్‌నెలలో కేంద్రప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో ఆస్తిపన్ను, నీటిపన్నులను రద్దైన నోట్లతో చెల్లించుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించడంతో చాలామంది పాతబకాయిలతో కలిపి కొత్తపన్నులను కూడా చెల్లించారు. ఆతర్వాత పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. ప్రధానంగా మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారుల నిర్లక్ష్యం వల్ల పన్నుల వసూళ్లలో ఏమాత్రం పురోగతి కనిపించడంలేదు. మున్సిపాలిటీ పరిధిలో 51,328 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇవీ కాకుండా మున్సిపాలిటీలో విలీనమైన అయ్యన్నపేట, జమ్ము, నారాయణపురం, ధర్మపురి, కెఎల్‌పురం, గాజులరేగ, వేణుగోపాలపురం తదితర గ్రామాలలో చాలా భవనాలకు నేటికీ కొత్తగా పన్నులు వేయలేదు. ఈ ప్రాంతాలలో సుమారు 11వేల వరకు భవనాలు ఉండగా, 1000 భవనాలకు మించి పన్నులు వేయలేదు. ఆస్తిపన్ను వేయాలని మున్సిపల్ కార్యాలయం చుట్టూ అసెస్‌మెంట్‌దారులు తిరుగుతున్నా రెవెన్యూ విభాగం అధికారులు ఏమాత్రం స్పందిండంలేదు. ప్రతీ ఏడాది ఇదేవిధంగా జరుగుతున్నా మున్సిపల్ పాలకులు కూడా పట్టించుకోవడంలేదు. ప్రధానంగా మున్సిపల్ రెవెన్యూ అధికారులతోపాటు బిల్లుకలెక్టర్లు కూడా పన్నుల వసూళ్లలలో తగిన శ్రద్ద చూపడంలేదు. ఆర్థిక సంవత్సరం గడువువరకు పట్టించుకోకపోవడం, గడువుసమీపిస్తున్న సమయంలో హైరానా పడటం అలవాటుగా మారింది. ఈ ఆర్థికసంవత్సరంలో 100శాతం ఆస్తిపన్ను వసూలు చేసేందుకు 18 ప్రత్యేక బృందాలను నియమించారు. పన్ను వసూలు కోసం రోజువారీ లక్ష్యాలతోపాటు వారాంతపు, నెలవారీ లక్ష్యాలను కూడా నిర్థేశించారు. ఇందుకు బిల్లుకలెక్టర్లకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. ఆస్తిపన్ను చెల్లించని అసెస్‌మెంట్‌దారులకు రెడ్‌నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఆదేశాలు జారీ చేశారు. అయితే కమిషనర్ ఆదేశాలు ఎక్కడా అమలు కావడంలేదు. ప్రతీ బిల్లు కలెక్టర్ రోజుకీ 50 రెడ్‌నోటీసులను ఇవ్వాలని ఆదేశించినా ఎవరూ పట్టించుకోవడంలేదు. పన్నుల వసూళ్లకు వెళ్లినప్పుడు అన్ అసెస్‌డ్, అండర్ అసెస్‌డ్ భవనాలను గుర్తించి ప్రతీరోజూ ఒక్కొక్క వార్డులో 50 నెంబర్లు గుర్తించి పన్ను పెంపునకు చర్యలు తీసుకోవాలని జారీ చేసిన ఆదేశాలు కూడా అమలుకు నోచుకోవడంలేదు.

చేతికందాల్సిన జీడితోట అగ్నికి ఆహుతి

* లబోదిబోమంటున్న బాధితురాలు

కొమరాడ, ఫిబ్రవరి 16: ఆరుకాలాలు శ్రమించి పండించిన జీడిమామిడి పంట చేతికందాల్సిన సమయంలో అగ్నికి ఆహుతైనట్లు బాధితురాలు కె.నారాయణ కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళ్లగా మండలంలోని పాలెం పంచాయతీ పూజారిగూడ గ్రామానికి చెందిన కె.నారాయణమ్మ సుమారు రెండు ఎకరాల జీడిమామిడి తోట వారం రోజులక్రితం అగ్నికి ఆహుతయ్యింది. జీడితోటకు ప్రక్కనున్న పొలంల్లో తుప్పులను కాల్చివేస్తుండగా గాలికి ఆ అగ్నితుంపర్లు జీడిమామిడితోటలో పడటంతో జీడితోట కూడా అగ్నికి దగ్ధమైందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. కేవలం జీడిమామిడి తోటపైనే ఆధారపడి జీవిస్తున్న తాము వేలాది రూపాయలు అప్పులుచేసి మదుపులు పెట్టామని, తీరా పంట చేతికందే సమయంలో అగ్నికి ఆహుతయ్యిందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి నష్టపోయిన జీడిమామిడి పంటకు నష్టపరిహారం అందించి ఆర్థికంగా తమను ఆదుకోవాలని బాధితురాలు కోరుతున్నారు.