విజయనగరం

ప్రతి కుటుంబం మరుగుదొడ్డి ఆవశ్యకతను గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 16: ప్రజల భాగస్వామ్యంతో జిల్లాను ఒడిఎఫ్‌గా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి పిలుపునిచ్చా రు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో సంపూర్ణ పారిశుద్ధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ట్రైనీలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం మరుగుదొడ్డి ఆవశ్యకతను గుర్తించాలన్నారు. ఇందుకు ప్రజల ఆలోచనలలో మార్పు రావాలన్నారు. మన రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. ప్రజల నుంచి సహకారం కొరవడటం వల్లనే పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నామన్నారు. అందువల్లనే మాస్టర్ ట్రైనీలు గ్రామాలలో పర్యటించి ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని కోరారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి నాటికి 150 గ్రామాలను ఒడిఎఫ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మిగిలిన గ్రామాలలో 50 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని లక్ష్యంగా పేర్కొన్నట్టు వివరించారు.
ఈ సందర్భంగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఫీడ్‌బ్యాక్ ఫౌండేషన్ సిఇఒ అజయ్‌సిన్హా హిందిలో మాట్లాడగా అపీక్షభట్ తెలుగులో అనువాదం చేశారు. ఈ సందర్భంగా అజయ్‌సిన్హా మాట్లాడుతూ గతంలో బహిరంగ మలవిసర్జనపై శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల వ్యాధులు ఎక్కువగా విజృంభించేవన్నారు. నేడు నాగరికత పెరిగిన కొద్దీ ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేగాకుండా బహిరంగ మల విసర్జన వల్ల తాగునీరు కలుషితమై దోమలు, వ్యాధులు విజృంభించే అవకాశం ఉందన్నారు. అందరు స్వచ్ఛ విజయనగరంనకు కృషి చేస్తే మూడు నెలల్లో దానిని సాధించగలమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎల్‌కెవి రంగారావు, స్వచ్ఛ భారత్ కన్సల్టెంట్ నీరజ్ తివారీ, యునిసెఫ్ ఇండియా వాష్ అధికారి ఎ.వెంకటేష్, జిల్లా నోడల్ అధికారి జి.రాజకుమారి, డిఆర్‌డిఎ పిడి డిల్లీరావు, డ్వామా పిడి ప్రశాంతితోపాటు మోటివేటర్లు పాల్గొన్నారు.