విజయనగరం

సమస్యలపై వత్తిడి తెస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (టౌన్), ఫిబ్రవరి 18: ఉత్తరాంధ్ర అభివృద్ధి సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిచేసి, విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపైనే ఆధారపడి ఉందని వినాశకర అభివృద్ధి పై ఆధారపడి లేదని పిడి ఎఫ్ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి అజశర్మ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అనతరం శ్రామిక భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 35 ఏళ్లగా ఉత్తరాంధ్రలోని అనేక ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించానని, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికద్వారా పలు అంశాలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురాగలిగానని చెప్పారు. అయితే ఉత్తరాంధ్ర వాణిని మరింతబలంగా చట్టషభల్లో వినిపించాలంటే సామాజిక ఆలోచనలు కలిగిన వ్యక్తిని ఎన్నుకోవల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈనేపధ్యంలో 216 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తన అభ్యర్ధిత్వాన్ని బలపరిచాయని చెపుతూ తనకు అవకాశం ఇస్తే ఉత్తరాంధ్ర సమస్యలపై అంశాల వారీగా గళం విప్పుతానని స్పష్టం చేసారు. వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని సద్వినియోగం చేయగలిగితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయని అన్నారు. సముద్రతీరం వెంబడి లభించే మత్స్య సంపదను లాభసాటిగా మార్చగలిగే సౌకర్యాలు ఫిషింగ్ హార్బరు నిర్మాణం భావనపాడులో చేయాలని అన్నారు. అలా కాకుండా పర్యావరణం దెబ్బతినే రసాయన, మందలు కర్మాగారాలు. ధర్మల్ ప్లాంట్ల వలన అభిదృద్ధి వస్తుందని చెపతున్నవారి ప్రకటనల
వలన శూన్య మని ఆరోపించారు. విశాఖకు రైల్వే జోన్, గిరిజన యూనివర్సిటీ, పెట్రో యూనివర్సిటీ, ఐ ఐ ఎం వంటి హామీలపై వత్తిడి తేక పోతే చాలా కోల్పోతామని అన్నారు. పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టు పూర్తికి 15 వేల కోట్లు కేంద్రం విభజన హామీల లో భాగంగా వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేసారు. మూతపడినపరిశ్రమలను తెరిపించేందుకు తనవంతు పోరాటం చేస్తానని అన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఒక్కోటి మూతపడుతున్నా వాటిని తెరిపించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయడం లేదని ముఖ్యమంత్రి హామీ నెరవేరలేదని విమర్శించారు. ఈనేపధ్యంలో పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈసమావేశంలో యుటి ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి కె శేషగిరి పాల్గొన్నారు.

క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి

విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 18: భవిషత్యత్తులో రాణించాలంటే విద్యకే ప్రాధాన్యత ఇవ్వకుండా క్రీడలపట్ల మక్కువ చూపాలని పోలీసుశిక్షణ కళాశాల ప్రిన్సిపల్ రాజశిఖామణి చెప్పారు. ఎస్ ఎఫ్ ఐ విద్యార్ధిసంఘం ఆధ్వర్యంలో ఇటీవల పదవతరగతి విద్యార్ధులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో జిల్లా ,పట్టణ స్ధాయిల్లో విజేతలుగా నిలిచిన విద్యార్ధులకు నగదుప్రోత్సాహక బహుమతులు ఆయన అందచేసారు. ఈసందర్భంగాశనివారం జడ్పీ మినిస్టీరియల్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ కేవలం మెదడుకు మాత్రమే పదును పెడితే సరిపోదని, శారీరక ధారుఢ్యం ఎల్లవేళలా కాపాడుకుంటేనే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించ గులుగుతామని వివరించారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌కి ఉన్న ప్రాధాన్యతను విద్యార్ధులకు, వారితల్లి దండ్రులకు తెలియజేసారు. క్రీడలు, శారీరక పోటీల్లో కూడా ప్రావీణ్యం సంపాదించి అన్ని రంగాల్లో నెగ్గుకు రావాలని చెప్పారు. వచ్చే నెలలో జరిగే పదవతరగతి పరీక్షలలో విద్యార్ధులు మంచి మార్కులు సాధించి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎస్ ఎఫ్ ఐ విద్యార్ధి సంఘం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ క్రీడలల్లో విద్యార్ధులు ఆసక్తి కనబరిచేలా చొరవ తీసుకోవాలని హితవుపలికారు. ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్తాడుతూవిద్యార్ధుల్లో ఉండే భయాన్ని పోగొట్టేందుకు ఈ పోటీ పరీక్షలు ఉపయోగ పడతాయని అన్నారు. జిల్లా స్ధాయిలో మంచి మార్కులు పొందిన రూపవతి,సాయిరాజ్, చరణ్‌తేజలకు నగదు ప్రోత్సాహకాలను ఆయన చేతులు మీదుగా అందచేసారు. ఈకార్యక్రమంలో విద్యార్ధి సంఘనాయకులు జగన్మోహన్, చింతయ్య, రామ్మోహన్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.