విజయనగరం

విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలి...కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, ఫిబ్రవరి 20: విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలని నగర పంచాయితీ కమిషనర్ వి.అచ్చింనాయుడు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేరివల్స్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని అన్నారు. ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తీపి గుర్తులు కావాలని అన్నారు. మెరుగైన ఫలితాలు సాధించినప్పుడే బంగారు భవిష్యత్తును పొందవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డి. వెంకటరావు, ఎస్సై ఉపేంద్రరావు, పూర్వవిద్యార్థులు భోగాపురం రామకృష్ణ, ఉన్నత పాఠశాల హెచ్ ఎం ప్రసాదరావు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని అలరించాయి.

జాతీయ సైన్స్ దినోత్సవం పోటీలు

నెల్లిమర్ల, ఫిబ్రవరి 20: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించామని ఎంఇఓ ఎ.కృష్ణారావు తెలిపారు. నిర్వహించిన పోటీల్లో సతివాడ మోడల్ స్కూల్‌కు చెందిన లోకేష్, సాహితీ లహరిలు ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవశం చేసుకున్నారు. అలాగే జూనియర్ విభాగంలో కస్తూరీబా పాఠశాలకు చెందిన కె. ఆశ ప్రథమ స్థానం, నెల్లిమర్ల జడ్పీహైచ్ ఎస్ పాఠశాలకు చెందిన ప్రవల్లిక ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వకృత్వ పోటీల్లో సీనియర్స్ విభాగంలో సి.హెచ్. శ్రీను, జరజాపుపేటకు హైస్కూల్ ప్రథమ స్థానం, బొప్పడాం హైస్కూల్ కి చెందిన సుమిత్రా ద్వితీయ స్థానంలో నిలిచారు. జూనియర్స్ విభాగంలో పి.సౌమ్మ, పి. గాయిత్రి ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవశం చేసుకున్నారు. య్రిగ్ పోటల్లో సీనియర్స్ విభాగంలో ఎం. మెహనరావు పి. నితిన్, జేనియర్స్ విభాగంలో కె.గణేష్; ఎం.జగదీష్ ఫ్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు.

రాష్టస్థ్రాయి క్రీడా పోటీలు ప్రారంభం

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 20: పట్టణంలోని విజ్జి స్టేడియంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. జెసి లఠ్కర్ ఈ పోటీలను ప్రారంభించారు. అండర్-16 విభాగంలో వాలీబాల్, ఫుట్‌బాల్ తదితర అంశాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు డిఎస్‌డిఒ సూర్యారావు తెలిపారు.