విజయనగరం

మందులపై తనిఖీలు పూజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 26: అలోపతి మందులను కేవలం మందుల దుఖాణాల్లోనే కొనుగోలు చేయాలని ఆంక్షలు ఉన్నప్పటికీ పల్లెల్లో ఎవరికి వారు వాటిని విక్రయిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అల్లోపతి మందుల విక్రయాలపై కొరఢా ఝుళిపించాల్సిన ఔషధ నియంత్రణ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో పల్లెల్లో ఎక్కడబడితే అక్కడ చాక్లెట్ల మాదిరిగా మందులు విక్రయిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. సాధారణంగా ప్రజలు కూడా తలనొప్పి, జ్వరం, ఇతర వాటికి ఆయా దుఖాణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అక్కడ అవి నయం కాకపోతే అప్పుడు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
ఏ రోగానికి ఎంత మందు వేయాలో తెలియని వారు కూడా వీటిని విక్రయిస్తుండటం వల్ల కొన్నిసార్లు మహిళలు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. వీటిలో నిషేధించిన మందులు కూడా విక్రయిస్తుండటం గమనార్హం.
ఇక గిరిజన ప్రాంతాలను పరిశీలిస్తే.. అక్కడ అన్నింటికీ భూతవైద్యుని నమ్ముతున్నారు. జ్వరం దగ్గర నుంచి అన్ని రోగాలకు అతను చెప్పిందే వేదంలా భావిస్తున్నారు. ఆ ఆలోచనల నుంచి గిరిజనులు బయటపడకపోవడంతో కొన్నిసార్లు ప్రాణాలమీదకు కొని తెచ్చుకుంటున్నారు. వీటిని అరికట్టాల్సిన ఔషధ నియంత్రణ అధికారులు చేతులు ముడుచుకొని కూర్చోవడంతో ఎవరికి వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
ఇదే విషయమై ఔషధ నియంత్రణ సహాయ సంచాలకురాలు ఎటివి రమాదేవి వద్ద ప్రస్తావించగా తాము ప్రతి నెల మందుల దుకాణాలను తనిఖీ చేస్తున్నామన్నారు. అయితే పల్లెల్లో కిరాణా దుఖాణాలలో మందులను విక్రయిస్తున్నమాట వాస్తవమేనన్నారు. వాటిని నియంత్రించడానికి సరిపడా సిబ్బంది తమ వద్ద లేరని చేతులెత్తేసారు. ఇక మందుల కొనుగోలుదారులకు కొన్ని మందుల దుఖాణాలలో రశీదులు ఇవ్వకపోవడాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా అలా రశీదులు ఇవ్వని వాటిపై చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌లోని ఆల్బెట్ డేవిడ్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన మెన్‌స్ట్రాల్ మందుపై కేసు నమోదు చేశామన్నారు.

జెఎన్‌టియులో సాంకేతిక సదస్సులు

విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 26: జెఎన్‌టియు విజయనగరం క్యాంపస్‌లో సాంకేతిక రంగంలో జాతీయ సదస్సులు ఈ నెల 27,28 తేదీలలో నిర్వహించనున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియం సదస్సు జరుగుతుందని జె ఎన్‌టియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంటు ప్రొఫెసర్ చింతా నీలిమాదేవి ఆదివారం తెలిపారు. ఈ జాతీయ సదస్సులో విశాఖ ఎన్‌ఎస్‌టిఎల్ సైన్‌టిస్టు చీపురుపల్లి సూర్యనారాయణ, బలరామ్ కృష్ణ ప్రసాద్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ జాతీయ సదస్సులో బైక్ అనాటమీ, కార్ అసెంబ్లీ,డిసెంబ్లీ అంశాలలో ఆటో మొబైల్ వర్క్‌షాపు ఉంటుందని తెలిపారు. ఆటో మొబైల్ రంగం, మెకానికల్ విభాగం వస్తున్న సాంకేతిక అంశాలపై నిపుణులు వారి నివేదికలు సమర్పిస్తారని చెప్పారు. రోబో రేస్, ఇనోవిజన్, మూవీ మానిక్స్ ఈవెంట్లలో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఇదిలా ఉండగా జెఎన్‌టియు సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు జరిగే క్రేసెన్స్ జాతీయ సదస్సులో సాఫ్ట్‌వేర్ రంగంలో వస్తున్న మార్పులు, ఇతర అంశాలపై టిసిఎస్‌కు చెందిన సుందర విశ్వనాథన్, పిఎస్‌పిఐ వ్యవస్థాపకులు బలరామ్‌ప్రసాద్‌లు విద్యార్థులకు వివరిస్తారని, కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్లు ఫారుక్, భవ్యశ్రీలు తెలిపారు. సాంకేతిక సదస్సుల్లో విద్యార్థులు పాల్గొని అవగాహన పెంచుకోవాలని కోరారు.

టిడిపి వైఫల్యాలు ఎండకడతాం:వైసిపి

నెల్లిమర్ల, ఫిబ్రవరి 26: గడపగడపకు వైసిపి కార్యక్రమలో టిడిపి ప్రభుత్వం వైఫల్యాలను ఎండకడతామని వైసిపి కేంద్ర పాలకమండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. మండలంలోని కొండగుంపాం గ్రామంలో గడపగడపకు వైసిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన టిడిపి ప్రభుత్వం ఆహామీలను విస్మరించిందని అన్నారు. రైతు, డ్వాక్రా రుణమాపీ పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. అర్హులకు పింఛన్లు, పక్కా గృహాలు రేషన్‌కార్డులు అందడం లేదని అన్నారు. పచ్చచొక్కా వారికే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు. టిడిపి గద్దెనెక్కి సుమారు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వ పాలన గాడిలో పడలేదని విమర్శించారు. కార్యక్రమంలో వైసిపి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పెనుమత్స సురేష్‌బాబు, నాయకులు అంబళ్ల శ్రీములునాయుడ, రఘుబాబు, చనమల్లు వెంకటరమణ, ఎంపిటిసి సభ్యులు రుంకాన పైడన్న, నాయకులు పతివాడ అప్పన్న, మొయిద రాంబాబు, మొయిద సూరిబాబు, పతివాడ అప్పారావు పాల్గొన్నారు.