విజయనగరం

రాష్ట్ర స్థాయి క్రీడలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 26: విద్యార్థులు క్రీడలతో సర్వతోముఖాభివృద్ధి సాధించగలరని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని విజ్జి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, క్రీడలలో పాల్గొనాలనే ఆసక్తి ముఖ్యమన్నారు. నేడు సరైన వౌలిక వసతులు లేని ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని గుర్తు చేశారు. పట్టణంలో వసతులు ఉన్న విజ్జి స్టేడియంను ఉపయోగించుకొని క్రీడాకారులు తమ ప్రతిభను కనబరచాలన్నారు. క్రీడల్లో ఒలింపిక్ పతకాన్ని సాధించిన పివి సింధుకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. ఈ పోటీల్లో అద్లెటిక్స్, వాలీబాల్, ఫుట్‌బాల్, హేండ్‌బాల్, కబడ్డీ అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పాల్గొని జిల్లాకు పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు.
విద్యార్థుల్లో క్రీడా సామర్థ్యాన్ని గుర్తించి క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని శాప్ మేనేజింగ్ డైరెక్టర్ బంగార్రాజు అన్నారు. క్రీడలు మేధాసంపత్తిని పెంపొందిస్తాయన్నారు. జెసి లఠ్కర్ మాట్లాడుతూ ఈ ప్రాంగణంలో క్రీడాకారులు రికార్డులు సృషించాలన్నారు. దీనికి ముందర క్రీడాకారుల నుంచి కలెక్టర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ చేశారు. అనంతరం ఒలింపియన్ మాణిక్యాలరావు క్రీడాజ్యోతితో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరచిన 41 మంది క్రీడాకారులను కలెక్టర్ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెసి యుసిజి నాగేశ్వరరావు, డిఆర్‌డిఎ పిడి డిల్లీరావు, సాంఘీక సంక్షేమశాఖ డిడి, నోడల్ అధికారి దేవానందం, డిఎస్‌డిఒ సూర్యారావు, ఐవిపి రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష

విజయనగరం, ఫిబ్రవరి 26: జిల్లాలో గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 78 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాశారని ఎపిపిఎస్సీ ప్రతినిధులు తెలిపారు. జిల్లాలో 26884 మంది అభ్యర్థులకుగాను 21010 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు. కాగా పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఆర్డీఒ శ్రీనివాసమూర్తి పరిశీలించారు. పట్టణంలోని చైతన్య టెక్నో స్కూల్ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే జెసి లఠ్కర్, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, తహశీల్దార్ కె.శ్రీనివాసరావులు పట్టణంలోని సన్ స్కూల్, ఆర్కె డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఇదిలా ఉండగా అభ్యర్థుల సౌకర్యార్థం ఐదు చోట్ల ఏర్పాటు చేసిన పరీక్ష సహాయ కేంద్రాల సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయని కలెక్టర్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు సహకరించిన ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ సిబ్బందిని ఆయన అభినందించారు.
మాధవ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
* ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎ. నాయుడు

గజపతినగరం, ఫిబ్రవరి 26: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల శాసన మండలి నియోజకర్గానికి టిడిపి పార్టీ బలపరిచిన బిజెపి అభ్యర్థి పివిఎన్ మాధవ్ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ పార్టీ శ్రేణులు పనిచేయాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎ.నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక స్వాతి ఫంక్షన్ హాలులో నియోజకవర్గ టిడిపి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ గెలుపునకు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. ఎన్నికల్లో ఏమరపాటు తగదని ఆఖరి క్షణం వరకు శ్రమించాలని అన్నారు. బిజెపి శ్రేణులతో కలసి కట్టుగా టిడిపి నాయకులు ప్రతి గ్రామంలో పనిచేసి పట్ట్భద్రుల ఓటర్లు మాధవ్‌కు ఓటు వేసే విధంగా ప్రచారం చేయాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎంతో సహకరిస్తుందని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో అవరోధాలు అధిగమించి ముందుకు సాగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి కారణమని అన్నారు.
కార్యక్రమంలో జడ్పీటిసి మక్కువ శ్రీధర్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రావిశ్రీధర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.వి.వి.గోపాలరాజు, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి బూడి మన్మధరావు, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు, సిహెచ్‌సి చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ, టిడిపి నాయకులు బుద్దరాజు రామ్‌జీరాజు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు

గజపతినగరం, ఫిబ్రవరి 26: గ్రూప్-2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ పరీక్షలు ఏడు కేంద్రాలలో నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిది గంటలకే అభ్యర్థులకు కేంద్రాల వద్దకు చేరుకుని మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు వ్రాసారు. నాలుగు రోడ్లు జంక్షన్‌లో గజపతినగరం తహశీల్దార్ మసీలామణి, యూనిక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గజపతినగరం ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, ప్రతిభ జూనియర్ కళాశాల, మరుపల్లి గ్రామం పరిధిలో గల బాలాజీ పాలిటెక్నికల్‌లో నిర్వహించిన పరీక్షలకు లైజేషన్ అధికారిగా గజపతినగరం తహశీల్దార్ బి. మసీలామణి వ్యవహరించారు. ఈ కేంద్రాలలో 1028 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాయాల్సి ఉండగా 157 మంది హాజరు కాలేదు. 871మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాసారు. ఆర్ సి ఎం స్కూల్, గాయత్రి కళాశాల, షిర్డిసాయి కళాశాలల్లో 550 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాసారు. ఈ కేంద్రాలకు తహశీల్దార్ ప్రసాద్‌పాత్రో లైజేషన్ అధికారిగా వ్యవహరించారు. కేంద్రాలకు సకాలంలో చేరడానికి రెండు వాహనాలను కూడా ఏర్పాటు చేసి అభ్యర్థులను తరలించారు.