విజయనగరం

ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలుః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 27: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేస్తామని ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు వి.కృష్ణంరాజు తెలిపారు. శుష్కవాగ్థానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఆరోపించారు. పట్టణంలో అమర్‌భవన్‌లో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న అస్తవ్యస్త, ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రధానంగా మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దీనిలోభాగంగా ఈనెల 28వతేదీన ప్రతిపాదిత రవాణా చట్ట సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్‌ఫోర్టు బంద్ చేపట్టాలని అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వున్న రవాణావ్యవస్థను ఆధారంగా చేసుకుని మన దేశంలో రోడ్డు రవాణాబిల్లును 2015లో ఒక డ్రాఫ్టు రూపంలో ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. అయితే మార్చి 9వతేదీన జరిగే పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లు ఆమోదం పొందితే రవాణారంగంలో పనిచేస్తున్న, ఆధారపడి బతుకుతున్న లక్షలాదిమందికి మరణశాసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎఐటియుసి జిల్లా నాయకులు ఎస్.రంగరాజు, ఆల్తి చినమారయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ ఒత్తిడుల మేరకే
మధ్యాహ్న భోజన నిర్వాహుకుల తొలగింపు

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 27: జిల్లాలో దత్తిరాజేరు మండలం గడసాం జెడ్పీ హైస్కూల్‌లో రాజకీయ ఒత్తిడుల మేరకు తొలగించిన మధ్యాహ్నభోజన పథకం నిర్వాహకులను తిరిగి తీసుకుపోతే పెద్దఎత్తున పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్నభోజన పథక కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.మురళీధరరావుతెలిపారు. పట్టణంలో అమర్‌భవన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకులను తొలగించారని తెలిపారు. గడసాం జెడ్పీ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్నభోజన పథకం నిర్వహణ చేపడుతున్న వెంకటేశ్వర మహిళా సంఘాన్ని రాజకీయ దురుద్ధేశ్యంతో తొలగించారని ఆరోపించారు. భోజన నిర్వాహుకులపై రాజకీయ కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నారని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టకుండా నిర్వాహకులను తొలగించారని తెలిపారు. రాజకీయ ఒత్తిడిల మేరకు తొలగించడం ఎంతమాత్రం శ్రేయస్కారం కాదన్నారు. తప్పించిన భోజన నిర్వాహకులకు వెంటనే నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నభోజన పథకం జిల్లా కోశాధికారి పి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌డబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 26: ఆర్టీసీలో ఆన్‌లైన్ పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (ఓపిఆర్‌ఎస్)ను అభిబస్ సంస్థకు ఇవ్వడాన్ని వ్యితిరేకిస్తూ సోమవారం ఇక్కడ ఆర్టీసీ డిపో ఎదుట స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యుఎఫ్) రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రీజనల్‌కమిటీ కార్యదర్శి వి.రాములు మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధి పేరుతో గతంలో అద్దెబస్సులను ప్రవేశపెట్టి డ్రైవర్లు, మెకానిక్‌లను తగ్గించారని తెలిపారు. అద్దెబస్సుల వల్ల నష్టాలు పెరిగాయని, లాభాలు ఏమాత్రం పెరగలేదని చెప్పారు. యాజమాన్యం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల సంస్థ ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతుందని, కాంప్లెక్స్‌లు వంటి ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుపేరుతో బదలాయిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేటువ్యక్తులకు అప్పగించి కండక్టర్లను తగ్గిస్తున్నారని చెప్పారు. ఈ చర్యలన్నీ ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరణ చర్యలలో భాగమేనని అన్నారు. తక్షణమే ఈ చర్యలను నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీలో అన్ని కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఉద్యమించేందుకు సిద్ధం కావాలని, ఇందుకు గుర్తింపుకార్మిక సంఘం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిపో అధ్యక్షుడు చంద్రయ్య, డిపో కార్యదర్శి రాములు, కెఆర్ కుమార్, పివి రావు, జిఎస్ నారాయణ, డివిపిరావుతదితరులు పాల్గొన్నారు.