విజయనగరం

నిరంతర విద్యుత్ అందించాలన్నదే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అందించాలన్న ధ్యేయంతోనే ఎపి విద్యుత్ నియంత్రణ సంస్థ (ఎపిఇఆర్‌సి) ప్రజల నుంచి ప్రతీ ఏటా సూచనలు స్వీకరించి అందరి ఆమోదంతో మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేయగలుగుతున్నామని ఎపిఇఆర్‌సి చైర్మన్ జస్టీస్ భవానీ ప్రసాద్ అన్నారు. సోమవారం ఇక్కడ విద్యుత్ భవన్‌లో నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ విద్యుత్ టారిఫ్ ఎలా ఉండాలన్న విషయమై ప్రతీ ఏటా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ప్రజల ఆలోచనలను స్వీకరించి పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తున్నామన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో లోపాలున్న విషయమై ఆయన వద్ద ప్రస్తావించగా వాటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా ఎపిఇపిడిసిఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలైన కార్పొరేషన్, గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల నుంచి ఒక క్రమపద్ధతిలో విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలన్నారు. అలాగే తాగునీటి వనరులకు కూడా విద్యుత్ ఛార్జీలను ఏ విధంగా పెంచితే బాగుంటుందో సూచించారు. అనంతరం పలువురు నుంచి అభిప్రాయాలను సేకరించారు.
డబ్బులు వెనక్కి ఇవ్వండి
తూర్పుగోదావరి జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు విషయంలో చట్టానికి విరుద్ధంగా రైతుల నుంచి కొంత మొత్తం వసూలు చేశారని, ఆ మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని భారత్ కిసాన్ సంఘ్ ప్రతినిధి కుమారస్వామి డిమాండ్ చేశారు. అలాగే హై ఓల్టేజి వచ్చినపుడు విద్యుత్ పరికరాలు కాలిపోయిన సందర్భంలో వాటికి విద్యుత్ సంస్థ వినియోగదారులకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిగులు విద్యుత్ అంటూ విద్యుత్ ఛార్జీలు పెంచడం తగదన్నారు.
ప్రజలపై భారం వేస్తే వినియోగం తగ్గుతుంది
విద్యుత్ లోటును పూడ్చటానికి ఆ భారం ప్రజలపై వేస్తే విద్యుత్ వినియోగం మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని సిపిఎం నేత సిహెచ్ నర్సింగరావు అన్నారు. ఇప్పటికే హెచ్‌టి వినియోగదారుల వినియోగం గణనీయంగా తగ్గిందని ఆయన గుర్తు చేశారు. లోటు ఉంటే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరించాలన్నారు.
క్రాస్ సబ్సిడీ తగదు
తక్కువ విద్యుత్ వినియోగించిన వాడిపై ఎక్కువ భారం, ఎక్కువ విద్యుత్ వినియోగించిన వాడిపై తక్కువ భారం వేసే క్రాస్ సబ్సిడీ విధానం సరికాదని రైతు సంఘం నాయకుడు తులసీదాస్ అన్నారు. బెల్లం క్రషర్లపై పెద్ద మొత్తంలో అపరాధ రుసుం విధించడం వల్ల ఈ ఏడాది క్రషర్లు ముందుకు రాలేదన్నారు. ఈ సమావేశంలో 65 ఫిర్యాదులు వచ్చాయని సెక్రటరీ ఎ.శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.రమేష్‌ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఎస్.విద్యాసాగర్, ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్లు బి.శేషుకుమార్, టివిఎస్ చంద్రశేఖర్, సిజిఎంలు, జిఎంలు పాల్గొన్నారు.