విజయనగరం

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూత ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 27: జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకర్లు చేయూత ఇవ్వాలని జిల్లాకలెక్టర్ వివేక్‌యాదవ్ విజ్ఞప్తి చేశారు. రిజర్వు బ్యాంకు హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ఒక హోటల్‌లో బ్యాంకు మేనేజర్లకు నిర్వహించిన కెసాసిటి బిల్డింగ్ శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రుణాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఆర్థికవృద్ధిరేటు పెరిగే అకాశం ఉన్న పరిశ్రమల స్థాపనకు చేయూత అందించి ప్రొత్సహించాలని కోరారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న,మధ్య తరాహా పరిశ్రమల ఏర్పాటుకు 775 కోట్ల రూపాయల రుణ లక్ష్యం కాగా, ఇంతవరకు కేవలం 135 కోట్లు మాత్రమే అందించారని తెలిపారు. అయితే కొన్ని బ్యాంకులు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలలో సూక్ష్మ,చిన్న, మధ్య తరాహా పరిశ్రమల ఏర్పాటుకు 535 ఎకరాల స్థలాన్ని గుర్తించామన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కొత్తవలస మండలం బలిఘట్టం వద్ద పరిశ్రమ ఏర్పాటుకు సమగ్ర నివేదిగక పంపామని, గజపతినగరం మండలం మరుపల్లి వద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు ఎపిఐఐసికు స్థలాన్ని అప్పగించామని కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. భోగాపురం ఎయిర్‌ఫోర్టు భూసేకరణ తుది దశకు చేరుకుందని, బిడ్‌ను ఖరారు చేసి పనులు ప్రారంభించామని చెప్పారు. విశాఖపట్టణం, గంగవరం పోర్టులు దగ్గరలోనే ఉన్నందున రవాణా సౌలభ్యం మెండుగా ఉంటుందన్నారు. కాగిత రహిత పాలనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందన్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలను ప్రొత్సహించవలసిన బాధ్యత బ్యాంకర్లు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ రిజర్వు బ్యాంకు జనరల్‌మేనేజర్ డాక్టర్ ఎస్.సుబ్బయ్య, డిజిఎం నాగేశ్వరరావు, ఆంధ్రాబ్యాంకు డిజిఎం రాధాకృష్ణ, ఎస్‌బిఐ ఆర్‌ఎం శ్రీనివాసరావు, ఎపిజివిబి ఆర్‌ఎం రామారావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం ఉదయభాస్కర్, లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్ గురవయ్య, సహాయ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీదే!
- మంత్రి కామినేని శ్రీనివాస్

విజయనగరం, ఫిబ్రవరి 27: ఉత్తరాంధ్ర పట్ట్భద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఇక్కడ నాయుడు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఓటర్ల వివరాలను సేకరించి వారితో నేరుగా తమ మద్దతుదారు పివిఎన్ మాధవ్‌కు ఓటు వేయాలని అభ్యర్థిస్తే గెలుపు తధ్యమని అన్నారు. ఆ దిశగా పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నించాలన్నారు. ఇప్పటికే గడువు తక్కువగా ఉందని, ఉన్న గడువులోగా ఓటర్లను కలుసుకునే విధంగా ప్రయత్నించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తాము తమ నియోజకవర్గంలో పర్యిటిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నామని ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, గీత తదితరులు పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి తాము కృషి చేస్తున్నామన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు జగదీష్ మాట్లాడుతూ ఓటర్ల వివరాలను సేకరించామన్నారు. అభ్యర్థులను కలుసుకొని తమ మద్దతుదారు పివిఎన్ మాధవ్ గెలుపునకు పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి మృణాళిని మాట్లాడుతూ ఎన్నికల్లో బిజెపితో కలసి పోటీ చేశామని, ఇపుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవ్‌కు అందరు సహకరిస్తే గెలుపు ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామి, చిరంజీవులు, ఎమ్మెల్సీ సంధ్యారాణి, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణతోపాటు బిజెపి నేతలు బి.శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.