విజయనగరం

ఆర్టీసి బస్సు బ్రేకు ఫెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, ఫిబ్రవరి 27: ఆర్టీసి బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి రైలు పట్టాలపైకి దూసుకువెళ్లిన సంఘటన మండలంలోని చినబోగిలి వద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపుం డిపోకు చెందిన ఏ.పి.35జడ్ 6017 నెంబర్ గల నాన్‌స్టాప్ సర్వీసు బస్సు సోమవారం బొబ్బిలి నుంచి పార్వతీపురం వైపు బయలుదేరింది. ఈతరుణంలో 36వ జాతీయ రహదారిలో చినబోగిలి వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా బస్సు బ్రేక్ ఫెయిలైనట్లు డ్రైవర్ నాగరాజు తెలిపారు. దీంతో బస్సు అదుపుతప్పి సమీపంలో ఉన్న రైలుపట్టాలపైకి దూసుకెళ్లింది. ఈ మేరకు బస్సులో ప్రయాణిస్తున్న దివ్య, గణేష్, మాదవి, కరుణ, చంద్ర, రాంబాబు, చిన్నమ్మ, దమయంతి, లక్ష్మి, లత, సమంత, సంజ, తదితర 12మంది ప్రయాణీకులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ మేరకు గాయపడిన వారిని సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్సఅందించారు. విషయం తెలుసుకున్న పార్వతీపురం జె.సి బాలాజీ లస్కర్, ఆర్డీఓ గోవిందరావు, బొబ్బిలి డి.ఎస్పీ సౌమ్యలతలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైలుపట్టాలపైకి వచ్చిన బస్సును తొలగించే ప్రయత్నాన్ని అధికారులు చేపట్టారు. దీంతో బొబ్బిలివైపువెళ్లే రైళ్ల రాకపోకలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది.

బిజెపి అభ్యర్థిని గెలిపించాలి
* మంత్రి మాణిక్యాలరావు

కొత్తవలస, ఫిబ్రవరి 27: త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థి పి.వి.మాధవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి టి. మాణిక్యాలరావు కోరారు. సోమవారం ఎస్.కోట మండలంలోని బొడ్డవరలో గల రఘురాజ్ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థిగా మాధవ్‌ను నిలబెట్టామని మిత్ర ధర్మాన్ని పాటిస్తూ అందరు కలసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో బిజెపిలు చేస్తున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పట్ట్భద్రులు ఓటు వేయాలని ప్రతి కార్యకర్త పది మంది ఓటర్లను కలసి మొదటి ప్రాధాన్య ఓటును వేయించాలని చెప్పారు. టిడిపి నుండి కావాల్సినంత సహాయ సహకారాలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే, మండల పరిషత్, జిల్లా పరిషత్ అభ్యర్థులతో నిత్యం కలుస్తూ ఓటర్ల శాతాన్ని పెంచాలని అన్నారు. బిజెపి అభ్యర్థి గెలిస్తే ఉత్తరాంధ్రకు కావలసినన్ని నిధులు రాష్ట్రం నుండి, కేంద్రం నుండి సాధించవచ్చని చెప్పారు. ఎన్నికలు అయ్యేవరకు ఏ ఒక్క కార్యకర్త నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. మాధవన్ గెలిపించే బాధ్యత తమదని ఎస్.కోట నియోజకవర్గ బిజెపి ఇన్‌చార్జ్ ఇందుకూరి రఘురాజ్ అన్నారు. కార్యక్రమంలో ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.