విజయనగరం

ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్ల, ఫిబ్రవరి 28: ప్రతి ఒక్కరు చట్టాలను అతిక్రమించి పనిచేస్తే శిక్షార్హులు అవుతారని విజయనగరం లీగల్ సర్వీస్ అధికారి జడ్జి శ్రీహరి అన్నారు. మంగళవారం గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ చండీప్రియ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా, ఎన్‌ఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పి మాట్లాడుతూ లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించరాదని అన్నారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా శిక్ష పడుతుందని అన్నారు. ఆడపిల్లలు పుడితే వ్యతిరేకించే తల్లిదండ్రులకు శిక్షలు తప్పవని చెప్పారు. మహిళా చట్టాలను కాపాడాలని అన్నారు. పెళ్లు చేసుకునే వారు చట్టాప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. సభ్య సమాజంలో మహిళలను గౌరవించాలని అన్నారు. చిన్నచిన్న కేసులు ఉంటే పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రతి చిన్న విషయానికి కోర్టులు చుట్టూ తిరగరాదని అన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవించే విధంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ చండీప్రియ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ప్రతి రోజు పేపర్లు చదువుకోవాలని అన్నారు. ఆడపిల్లలను పనిలో పెట్టకుండా చదివించాలని అన్నారు. కార్యక్రమంలో లాయర్లు రవిశంకర్, నేచురోపతి వైద్యురాలు రజితారాయి తదితరులు పాల్గొన్నారు.