విజయనగరం

ఆర్టీసీలో బిసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 28: విజయనగరం ఆర్టీసీ డిపో పరిధిలో బిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎపిఎస్‌ఆర్టీసీ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వైస్‌చైర్మన్ భూషణరావుకోరారు. ఈ మేరకు ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి ముత్తిరెడ్డి సన్యాసిరావుకు మంగళవారం ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూషణరావుమాట్లాడుతూ విజయనగరం డిపోలో ఎర్నింగ్ సెక్షన్‌లో సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే మంచినీటి సదుపాయాలు లేకపోవడం అనేక అవస్థలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎర్నింగ్‌సెక్షన్‌లో సదుపాయాలను ఏర్పాటుచేయడంతోపాటు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. కొంతమంది కండక్టర్లు పెట్టుకున్న అప్పీళ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బిసి సంక్షేమ సంఘ నాయకులతో జాయింట్‌మీటింగ్ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా
విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన

జామి, ఫిబ్రవరి 28: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జామి మండలంలోని పలు పాఠశాలలు జామి, అలమండ, శివరాం, విజినిగిరి పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను విద్యార్థులు మంగళవారం నిర్వహించారు. జామి ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులు గ్రూపులుగా తయారై సోలార్ ట్రైన్ సిస్టమ్, విండోపవర్, పిండిపదార్థ పరీక్ష, పాడైన ట్యూబ్‌లైట్లను వెలుగించుట, స్వచ్ఛ భారత్‌లో మరుగుదొడ్లు వినియోగంపై అవగాహన, ప్రకృతి సేధ్యం, ద్రవాల గుండ విద్యుత్ ప్రవాహం వంటి అంశాలపై ప్రయోగాలు చేసి ఒక్కొక్క అంశంపై తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాములు మాట్లాడుతూ విద్యార్థులంతా ఇటువంటి ప్రయోగాలు చేసి తమ మేథా శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.