విజయనగరం

మంత్రి పదవిపై మల్లగుల్లాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 28: త్వరలో రాష్ట్ర మంత్రి వర్గం విస్తరించనుండటంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారోనని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో మెజార్టీ ప్రజలు తూర్పు కాపు, వెలమ కులానికి చెందిన వారు ఉండటంతో ఈ దఫా మంత్రి పదవి తమకే దక్కుతుందని భావిస్తున్నారు. మరోపక్క ఇరువురు కూడా మంత్రి పదవి తమకు కట్టబెట్టాలని అధిష్టానంపై వత్తిడి తెస్తున్నట్టు బోగట్టా. కాగా, మొత్తం తొమ్మిది నియోజక వర్గాలకు గాను ఎస్టీ మూడు నియోజకవర్గాలు మినహాయించగా మిగిలిన ఆరింటిలో నాలుగు నియోజకవర్గాల్లో తూర్పుకాపు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆ సామాజిక వర్గానికే మంత్రి పదవి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు నాలుగు నియోజకవర్గాలకు చెందిన నేతలు తమలో మంత్రి పదవిని ఎవరికి కేటాయించిన తమకు అభ్యంతరం లేదని అధిష్టానం వద్ద పేర్కొన్నట్టు సమాచారం.
మరోపక్క ప్రస్తుత మంత్రి వర్గంలో ఎస్టీ కోటా కింద ఖాళీ ఉండటంతో ఆ అవకాశాన్ని తనకే కట్టబెట్టాలని జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పట్టుబడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల వైకాపా నుంచి టిడిపిలో చేరిన బొబ్బిలి రాజవంశానికి చెందిన సుజయ్‌కృష్ణ రంగారావు కూడా తనకు మంత్రి పదవి కట్టబెట్టాలని వత్తిడి తెస్తున్నారు. ఈయనకు మంత్రి పదవి కట్టబెడితే మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనకంటూ ఓ వర్గం ఉన్నందున పార్టీకి బలం చేకూరుతుందని కొందరు చెబుతుండగా, మరికొందరు జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు రాజవంశాలకే కట్టబెట్టారన్న విమర్శలు విన్పిస్తాయని, దీనిని మెజారిటీ సామాజిక వర్గం జీర్ణించుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ దఫా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారికే మంత్రి పదవి కట్టబెట్ట వచ్చని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.

బ్యాంకుల ఉద్యోగుల వేతన సవరణకు ఉద్యమం
* బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం పిలుపు

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 28: బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ కోసం పెద్దఎత్తున ఉద్యమించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.మురళీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్లు ఇచ్చిన పిలుపుమేరకు పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు మంగళవారం బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌బిఐ ఫోర్టు బ్రాంచ్ నుంచి కోట జంక్షన్, మూడులాంతర్లు మీదుగా ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో మురళీ శ్రీనివాసరావుమాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందాలను అమలు చేయడంలో ఇండియన్ బ్యాంకర్ల అసోసియేషన్ మొండివైఖరి అవలంభిస్తుందని ఆరోపించారు. 10వ ద్వైపాక్షిక వేతన సవరణ ఒప్పందం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగిస్తుందని, నవంబర్ నుంచి 11వ ద్వైపాక్షిక వేతన సవరణ అమలు కావలసి ఉందన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం జిల్లా కార్యదర్శి పి.మధుసూదనరావుమాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఐదు అవార్డు ఎంప్లాయిస్ యూనియన్లు ఉమ్మడిగా తమ డిమాండ్ల ముసాయిదాను ఇండియన్ బ్యాంకర్ల అసోసియేషన్ (ఐబిఎ)కు సమర్పించడం విశేషమని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు నాటికి డిఎను ప్రస్తుత బేసిక్ వేతనంతో కలిపి మరింత అదనపు పెంపుదలతో బేసిక్ పే స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10వ వేతన సవరణలో ప్రవేశపెట్టిన స్పెషల్ అలవెన్స్‌ను బేసిక్ వేతనంతో కలపాలన్నారు. ఉద్యోగులందరికీ ఎటువంటి సీలింగ్ లేకుండా బోనస్ చెల్లించాలన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు వి.కృష్ణంరాజు, ఎన్‌సిబిఇ రీజనల్ కార్యదర్శి పి.సతీష్, బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు వెంకటాచలం, ఎం.అప్పారావు, ప్రకాష్, నాగేశ్వరరావు, శాంతీశ్వరరావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.