విజయనగరం

సమన్వయం కరవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 15: విజయనగరం మున్సిపాలిటీలో పాలకవర్గసభ్యులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఫలితంగా అభివృద్ధి పనులకు శాపంగా మారింది. దీనికి తోడు కౌన్సిల్ సభ్యుల మధ్య అవగాహన, అధికారుల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల పాలనాపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లోపాలను సవరించడంలో అటు మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణగాని, ఇటు మున్సిపల్ కమిషనర్ నాగరాజుగాని దృష్టిని సారించకపోవడంతో ఈ పరిణామాలు పట్టణ అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అధికారుల పనితీరుపై విమర్శలు చేస్తున్న పాలకవర్గసభ్యులు కూడా పాలనాపరమైన లోపాలను చక్కదిద్దే ప్రయత్నాలు చేయడం లేదు. పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని గత రెండేళ్ల నుంచి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పటికీ, అధికారులలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా సమస్యలపై మహిళా సభ్యులు సైతం గళమెత్తినప్పటికీ వారిలో ఏమాత్రం చలనం లేకపోవడంతో మున్సిపాలిటీలో ఏమి జరుగుతుందో అర్థం కాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ పాలనపై దృష్టి సారించకపోవడం, అభివృద్ధిపై తగిన శ్రద్ద చూపకపోవడమే ఇందుకు కారణమని పలువురు కౌన్సిల్‌సభ్యులు బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన 32 కౌన్సిల్ సభ్యులు ఉన్నప్పటికీ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని విమర్శలు చేయడం విశేషం. అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆ పార్టీ కౌన్సిల్ సభ్యులు ఆదుర్తి వాసుదేవ్, సుంకరి విజయలక్ష్మి, రౌతు పద్మ, ఉండ్రాళ్ల వెంకటలక్ష్మి, కొర్నాన రాజ్యలక్ష్మి, కెల్ల వరలక్ష్మి, కిల్లాన పార్వతి, గేదెల ఆదినారాయణ ఈనెల 11వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ప్రజా సమస్యలను పరిష్కరించలేనప్పుడు పదవులలో ఉండటం భావ్యం కాదంటూ కౌన్సిల్‌ను రద్దు చేయాలని సీనియర్ కౌన్సిలర్ రొంగలి రామారావు కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించడమేకాకుండా మున్సిపల్ చైర్మన్ రామకృష్ణకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. దీనిని బట్టి మున్సిపాలిటీలో పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటైన రెండేళ్లు గడుస్తున్నా చైర్మన్ రామకృష్ణ పాలనాపరమైన వ్యవహారాలను చక్కదిద్దడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.