విజయనగరం

యువతతోనే దేశపురోభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(పూల్‌బాగ్),మార్చి 3: దేశపురోభివృద్ధి యువతతోనే సాధ్యపడుతుందని ప్రొఫెసర్ ఏ.ప్రసన్నకుమార్ అన్నారు.శుక్రవారం పూల్‌బాగ్‌లో ఉన్న ఎం. ఆర్ పిజి కళాశాలలో జరిగిన మాన్సాస్ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో యువత అధికంగా ఉన్న దేశం భారత దేశం అని అన్నారు.యువశక్తి దుర్వినియోగం కావడం బాధాకరమని అన్నారు.ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో భారతీయులే ఉండటం ఆనందదాయకమని పేర్కొన్నారు.మాన్సాస్ కరస్పాండెంట్ డాక్టర్ డి ఆర్‌కె రాజు మాట్లాడుతూ విజయనగరం మహారాజులు విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసారని చెప్పారు.1857 సంవత్సరంలో కలకత్తా యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, బొంబాయి యూనివర్సిటీ రావడంతో అప్పటి విజయరామగజపతి విద్యాసంస్థలను స్థాపించారని పేర్కొన్నారు. ఆనందగజపతిరాజు తను పరిపాలించేరోజుల్లో ఎక్కువగా కళలకు ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు.డాక్టర్ పివిజిరాజు 14వేల ఎకరాల్లో స్వామి జ్ఞానానంద ఆశీస్సులతో మాన్సాస్ ట్రస్ట్‌ను స్థాపించారని అన్నారు.కళాశాల సంచాలకులు ఐ.్భస్కరరెడ్డి మాట్లాడుతూ మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు అభివృద్ధి పధంలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. ఈసందర్భంగా కళాశాల సిబ్బంది ప్రసన్నకుమార్‌ను ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలో ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ పి. ఉదయ్‌కుమార్,డాక్టర్ కరణం విశ్వభూషణ్,డాక్టర్ బి ఎస్ ఎన్ రాజు ,అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

చేతివృత్తులతోనే స్వయం ఉపాధి

విజయనగరం(పూల్‌బాగ్),మార్చి 3:మహిళలు చేతివృత్తులను అభ్యసించి స్వయం ఉపాధిని పొందాలని చేతివృత్తుల స్వయం ఉపాధి కేంద్రం నిర్వాహకురాలు కాంచన అన్నారు. పట్టణంలోని కామాక్షి నగర్‌లో చేతివృత్తుల స్వయం ఉపాధి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కేంద్రంలో పేద,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్,టైలరింగ్,గోల్డ్ కవరింగ్ వస్తువుల తయారీలో శిక్షణను అందిస్తామని చెప్పారు.మహిళలు ఈ కోర్సులలో శిక్షణ పొందేందుకు ఏవిధమైన రుసుము చెల్లించనవసరం లేదని అన్నారు.మహిళలు ఇంటి వద్ద వృధాగా కాలాన్ని గడిపే బదులు ఆసమయంలో శిక్షణ పొందితే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.మూడు నెలల శిక్షణ పూర్తి ఐన వెంటనే వారికి దృవపత్రాలను అందచేస్తామని అన్నారు.కార్యక్రమంలో పలువురు స్థానిక మహిళాసంఘాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.

ఆదిరాజును బలపర్చండి
విజయనగరం(పూల్‌బాగ్),మార్చి 3: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎం ఎల్ సి ఎన్నికల్లో పోటీ చేస్తున్న యడ్ల ఆదిరాజును బలపరచాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ఏ.కరీం అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ వర్గాలకు చెందిన వారే కాకుండా ఇతరులు కూడా ఆదిరాజును బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమంలో మైనార్టీలు పాల్గొన్నారు.