విజయనగరం

జూన్ నాటికి అర్హులకు దీపం కనెక్షన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 3: గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్లపై ప్రచారం నిర్వహించి వచ్చే జూన్ నాటికి అర్హులందరికీ దీపం కనెక్షన్లు మంజూరు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లఠ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాను పొగ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. శుక్రవారం ఇక్కడ పౌరసరఫరాశాఖ అధికారులు, ఆయిల్ కంపెనీలు, గ్యాస్ కంపెనీలు, పెట్రోల్ డీలర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4.78 లక్షల కార్డుదారులలో అర్హులైన వారికి దీపం కనెక్షన్లు అందజేయాలన్నారు. దీపం పథకానికి సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు, డేటా ఎంట్రీ, ఆధార్ నంబరు తదితర వాటిని వేగవంతం చేయాలన్నారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద జిల్లాలో 14వేల మందికి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలన్నారు. నాన్ ఎల్‌పిజి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలన్నారు. పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని గిరిజన గ్రామాలకు అధిక సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 5 కిలోమీటర్లలోపు గ్యాస్ రవాణాకు ఎలాంటి ఖర్చును లబ్ధిదారుల నుంచి వసూలు చేయరాదన్నారు. సాధారణంగా గృహ అవసరాలకు వినియోగించే 14.5 కిలోల గ్యాస్ సిలిండర్‌కు బదులు 5 కిలోల గ్యాస్ సిలిండర్ స్టౌవ్‌ను ఉచితంగా అందజేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గ్రామ స్థాయిలో రేషన్ డీలర్ల సహకారం తీసుకోవాలన్నారు. గ్యాస్, పెట్రోల్ ఏజెన్సీల ప్రతినిధులు గ్రామ స్థాయి అధికారులు, రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాలన్నారు. పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీదారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. అందుకు అవసరమైన ఈపోస్ యంత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్‌ఒ శాంతికుమారి, ఎఎస్‌ఒ నాగేశ్వరరావు, హెచ్‌పిసిఎల్ సేల్స్ మేనేజరు చౌదరి, గ్యాస్ ఏజన్సీ, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్‌ను గెలిపించాలి
* ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ
ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు విజ్ఞప్తి
విజయనగరం (్ఫర్టు), మార్చి 3: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీగా పోటీలో ఉన్న మాధవ్‌ను గెలిపించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న మాధవ్‌ను విజయానికి చేయూత అందించాలని కోరారు. పట్టణంలో పలు ప్రాంతాలలో శుక్రవారం పర్యటించి మాధవ్‌కు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయని, అందువల్ల బిజెపి,టిడిపి బలపర్చిన మాధవన్‌ను గెలిపించాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి జరగాలంటే మాధవన్‌ను విజయానికి కృషి చేయాలన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావుమాట్లాడుతూ మాధవ్‌ను గెలిపిస్తే విద్యావంతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణంలో సంవత్సరాల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే సత్తా కేవలం మాధవన్‌కు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్ట్భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.