విజయనగరం

ఎయిర్‌పోర్టు పనులకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 4: బోగాపురంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు అన్ని అనుమతులు లభించినట్టే. ఇటీవల పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి కావడంతో దాదాపు ప్రక్రియ అంతా పూర్తయ్యింది. మరో నాలుగు రోజుల్లో కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రానున్నాయి. కేంద్రం గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బహుశా ఈ నెలాఖరు నాటికి పనులకు శ్రీకారం చుట్టే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మరోపక్క భూ సేకరణలో దాదాపు 80 శాతం మందికి పైగా నష్టపరిహారం చెల్లింపులు జరగడంతో ఎయిర్‌పోర్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. కేవలం 5గురు బాధితులు కోర్టును ఆశ్రయించారు. వారిలో ఇద్దరు తమ కేసులను వెనక్కి ఉపసంహరించుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులకు భూసేరణ ప్రక్రియ మరింత సులభతరమైంది.
స్థలాన్ని పరిశీలించిన బిడ్డర్లు
మరోపక్క ఇటీవల అంతర్జాతీయ విమానాశ్రయ స్థలాన్ని బిడ్డర్లు పరిశీలించారు. మొత్తం తొమ్మిది మంది బిడ్డర్లు స్థలాన్ని పరిశీలించి వెళ్లారని ఆర్డీవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. త్వరలో విమానాశ్రయ పనులు ప్రారంభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. భూసేకరణ కూడా దాదాపు కొలిక్కి వచ్చింది.
బాధితులకు పునరావాసం
దేశంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్‌పోర్టు బాధితులకు అన్ని హంగులతో అందంగా పునరావాస కాలనీలు నిర్మించేందుకు డిజైన్లను తయారు చేశారు. వాటిలో తొలిసారిగా శ్మశాన వాటికను కూడా చేర్చారు. వుడా అనుమతి కోసం వాటిని పంపినట్టు సమాచారం. మరోపక్క బిడ్డర్లు పనులు ప్రారంభిస్తే సిఎస్‌ఆర్ నిధులతో పునరావాస కాలనీ పనులు వేగవంతం చేసే అవకాశం ఉంటుందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. విమానాశ్రయం నిర్మించాల్సి వస్తే ఏ రకమైన కార్మికులు అవసరం, ఎలాంటి శిక్షణ పొంది ఉండాలి తదితర అంశాలపై సర్వే చేపట్టారు. ఎంత మందికి ఉపాధి కలగనుంది? ఏ రకమైన అర్హతలు ఉండాలి? స్థానికులకు ఏ విధంగా ప్రయోజనం కల్పించగలము అనే అంశాలపై కూడా సర్వే చేశారు. మరి కొద్ది రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

సాధనే విజయానికి
తొలిమెట్టు
విజయనగరం(టౌన్),మార్చి 4: గత ఏడాది అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన గణిత ఒలంపియాడ్‌లో ప్రతి భ చూపిన త్రిశూల్ రమణాస్కూలు విద్యార్ధులను కేంద్రమమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రత్యేకంగా అభినందించారు. ఈసందర్భంగా ఆయన విద్యార్ధులను ఉద్ధేశించి మాట్లాడుతూ ఏఅంశంలోనైనా రాణించాలంటే సాధన ముఖ్యమని సూ చించారు. అవగాహన, విషయపరిజ్ఞానం అలవరచుకుంటే గణితంలోకూడా ప్రతి ఒక్కరు రాణించగలరని ఆన్నారు. విద్యార్ధులను కేంద్రమంత్రికి స్కూలు కరస్పాండెంట్ త్రిశూల్‌కుమార్ పరిచయం చేసా రు. పాఠశాలనుండి 75మంది విద్యార్ధులు ఒలంపియాడ్‌లో పాల్గొన్నారని, ఇందు లో 9వతరగతి విద్యార్ధులు రామ్‌కుమార్, అజేయ్‌లకు ఎక్సలెన్సీ అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈపోటీల్లో 36 మందికి బంగారు, 34మందికి వెండి, 15మంది విద్యార్ధులు కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ, ఎ ఒ రాంబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అభివృద్ధే అజెండా
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 4: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాయని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. శనివారం కోటలోని బిఇడి కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. బోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, 43వ జాతీయ రహదారి విస్తరణ పనులు, కొత్తవలసలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అంశాలకు అధిక ప్రాధాన్యతనిచ్చినట్టు తెలిపారు. ఈ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్న బిజెపికి మద్దతు పలకాలన్నారు. రానున్న పట్ట్భద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి- టిడిపి అభ్యర్థి పివిఎన్ మాధవ్‌కు ఓటువేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి కె.హరిబాబు మాట్లాడుతూ విజ్ఞులైన ఉపాధ్యాయులు బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి పివిఎన్ మాధవ్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. మంత్రి మృణాళిని మాట్లాడుతూ బిజెపి అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీసాల గీత, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిఇడి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జోరుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మార్చి 4: పట్ట్భద్ర ఎమ్మెల్సీ ఎన్నికల గడువు ముంచుకొస్తుండటంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల్లో ఎవరికి వారు తమదే గెలుపు అని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై తమకు అవగాహన ఉందని, తమకు ఒకసారి అవకాశం కల్పిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి అజశర్మకు యుటిఎఫ్ ఇతర సంఘాలు గుంభనంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక బిజెపి అభ్యర్థి మాధవ్‌కు టిడిపి నేతలు నియోజకవర్గాల్లో విస్తృ త ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజుకు కాంగ్రెస్, వైకాపా ఓట్లతోపాటు తటస్థ ఓటర్లు తమకు ఓటు వేస్తారన్న దీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ విధం గా అభ్యర్థులు విస్తృతంగా పర్యటనలు జరుపుతున్నారు. ఎవరి అజెండా వారు ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నువ్వా? నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజు శనివారం విజయనగరం, కొత్తవలస, విశాఖ సిటీలో ప్రచారం చేపట్టారు. ఇక బిజెపి అభ్యర్థి పివిఎన్ మాధవ్‌కు మద్దతుగా కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు, టిడిపి ఎమ్మెల్యేలు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఇక మిగిలిన స్వతంత్ర అభ్యర్థులు ఎంబిఎ అప్పారావు దొర, లీడర్ సంపాదకుడు వివి రమణమూర్తి, ఆదాడ మోహనరావు, విద్యార్థి సంఘం నాయకుడు లగుడు గోవిందరావు తదితరులు ఎక్కువగా విశ్వవిద్యాలయాల ఓటర్లపైనే ఆశలు పెంచుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికను బిజెపి, టిడిపి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థుల మధ్య నువ్వా? నేనా? అన్నరీతిలో పోటీ నెలకొంది.

విద్యుత్ లైన్ల మార్పుపై రగడ
గజపతినగరం, మార్చి 4: గత ఆరేళ్లుగా వివాదంలో కొనసాగుతున్న చల్లపేట ఫీడర్ 11కెవి విద్యుత్ లైన్ మార్చే ప్రక్రియ శనివారం లైన్ మార్చడానికి విద్యుత్ శాఖ అధికారులు పనిలోకి దిగడంతో స్థానికులు పనులను అడ్డుకోవడంతో వివాదానికి దారితీసింది. విద్యుత్ శాఖ డి ఇ ప్రసాదరావు పర్యవేక్షణలో ఏడిఎ వరదరాజులు, ఏఇ పిచ్చయ్య సిబ్బందితో పురిటిపెంట న్యూ-కాలనీలో ఇళ్ల పైన గల 11కెవి విద్యుత్ లైన్ మార్చడానికి సిద్ధమయ్యారు. ఇళ్లపై వైర్లు తొలగించి ఎవరికీ ఇబ్బంది లేకుండా లైన్ వేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ హర్షవర్థన హైస్కూల్ వీధిలోని కాలనీ వాసులు ఈ వైర్లను మార్చి కాలనీ మీదుగా ఏర్పాటు చేస్తే తమకు నిత్యం ప్రమాదం అంచున జీవనం సాగించాల్సి ఉంటుందని ఎదావిధిగా వైర్లు ఉంచాలని, పనులను అడ్డుకున్నారు. అలాగే లైన్ మార్చితే ఆత్మహత్యచేసుకుంటామని కాలనీకి చెందిన చంద్రశేఖర్ కిరోసిన్ కూడా పోసుకుని నిప్పు అంటించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అధికారులు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై వరప్రసాద్ రంగ ప్రవేశం చేసి ప్రజా అవసరాల కోసం చేసే పనులను ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం నేరమని, వైర్లు మార్చడానికి సహకరించాలని స్థానికులకు నచ్చజెప్పారు. ఒకవేళ పనులను అడ్డుకుంటే వీడియో తీసి వ్రాత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగా లైన్ ఏర్పాటు చేసినపుడు అధికారులు కూడా ఎవరికీ హాని కలగకుండా వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల ఈ వైర్లు తగిలి ఒక మహిళ మృతి చెందడంతో విద్యుశాఖ అధికారుల ఇళ్లపైన వైర్లు తొలగించి పక్క నుండి ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టగా కొత్తగా లైన్ వేయడం వలన ఇళ్ల ముందు నుండి వైర్లు వెళ్లి తమకు ప్రమాదాలు జరుగుతాయని కొంతమంది స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ పనులు అడ్డుకోవడం జరిగింది. ఎవరికీ హాని జరగకుండా వైర్లు ఏర్పాటు చేస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నా వినకపోవడంతో వివాదానికి దారి తీసి పోలీసులు రంగ ప్రవేశంతో వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

గిరిజన విద్యార్థి మృతి
కురుపాం, మార్చి 4: మండలంలోని పొడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న మండంగి విజయ్(12) అనే గిరిజన విద్యార్థి మృతిచెందాడు. శనివారం విశాఖ కె.జి.హెచ్.కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. 7వ తరగతి చదువుతున్న మండంగి విజయ్ శుక్రవారం జరిగిన ఆటల్లో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కురుపాం సి.హెచ్.సి.కి తరలించగా ప్రథమ చికిత్స పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెదడకు సంబంధించిన వ్యాధిని గుర్తించడంతో శనివారం విశాఖ కె.జి.హెచ్.కు తరలించారు. మార్గం మధ్యలోనే మృతిచెందాడు. శనివారం మండల ఏ.టి.డబ్ల్యు.ఓ. చంద్రశేఖర్, పాఠశాల హెచ్. ఎం.రమేష్, వార్డెన్ అప్పారావులు విజయ స్వగ్రామమైన ఇప్పలగుడ్డికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. దహన ఖర్చుల నిమిత్తం 5వేల రూపాయల ప్రభుత్వ సాయాన్ని అందించారు.
విమర్శకాదు- మనపై బాధ్యత
* ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
వేపాడ, మార్చి 4: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ అభయర్తి బిజెపి పై మండలటిడిపి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసి విమర్శించడంపై శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పందించి విమర్శకాదు మనపై బాధ్యత ఉందని నాయకులను కార్యకర్తలను సముదాయించారు. మండల కేంద్రమైన వేపాడలో శనివారం ఆమె ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎన్నికల విషయమై సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు శానాపతి తాతారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.
ఉత్సవ రధానికి ఘనస్వాగతం
సాలూరు, మార్చి 4: సర్వమానవ సౌభ్రాతత్వానికి భగవానస్మరణమే శరణ్యమని భగవత్ రామానుజ సహాస్రాబ్ధి ఉత్సవ యాత్ర చేపట్టినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు కె.విశ్వనాధం అన్నారు. శనివారం రాత్రి రామానుజ చార్యుల వారి ఉత్సవ యాత్ర రధానికి స్వాగతం పలికి పట్టణంలోని పలువీధుల్లో ఊరేగించారు. సర్వమానువులు ఒక్కటేనని, భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనన్నారు. సనాతనధర్మ ప్రచారం చేయడంలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను నిలబెట్టిన ఘనత రామానుజచార్యులకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వికాసతరంగిణి సభ్యులు వాడాడ శోభారాణి, వాసుదేవపండా, వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కల్యాణమండపం స్థలాన్ని పరిశీలించిన జెసి
కొత్తవలస, మార్చి 4: మండలంలోని కొత్తవలస టిటిడి దేవస్థానం నిర్మిస్తున్న కళ్యాణ మండపం నిమిత్తం కేటాయించిన భూమిని శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ బాలాజీ లఠ్కర్ పరిశీలించారు. ఈ కళ్యాణ మండపం నిర్మాణం కోసం డ్రైవర్స్ కాలనీ వద్ద స్థలాన్ని కేటాయించారు. స్థలాన్ని అప్పగించలేదన్న కారణంగా కళ్యాణ మండపం నిర్మాణ పనులు నిలిచాయి. దీంతో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్థల పరిశీలన చేసి స్థలాన్ని అప్పగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మినీ స్టేడియం నిర్మాణం, గిరిజన యూనివర్సిటీ పనులు, పతంజలి గ్రూపుకు అప్పగించిన భూములు తదితర వాటికి ఇచ్చిన భూముల యొక్క రికార్డులను ఆర్డీ ఓ సమక్షంలో పరిశీలించారు. ఎక్కడా ఆటంకాలు రాకుండా అధికారులు చర్యలు తీసుకుని భూములను ఆయా సంస్థలకు అప్పగించాలని తహశీల్దార్ ఆనందరావుకు సూచించారు. ప్రభుత్వ భూముల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆర్డీ ఓ శ్రీనివాసమూర్తి, తహశీల్దార్, సర్వేయర్ జెసి వెంట ఉన్నారు.