విజయనగరం

ఎమ్మెల్సీ అభ్యర్థి రమణమూర్తిని గెలిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 6: ఉత్తరాంధ్ర పట్ట్భద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో లీడర్ సంపాదకులు వివి రమణమూర్తిని గెలిపించి పట్ట్భద్రులు తమ విజ్ఞతను చాటుకోవాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ గురజాడ స్కూల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో మేధావులను పంపించడం ద్వారా విధానపరమైన నిర్ణయాలకు సరైన పరిష్కారం లభించగలదన్నారు. బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రత్యేక హోదాకు చట్టబద్ధతగానీ, రైల్వే జోన్ ఊసెత్తడం లేదన్నారు. గతంలో కమిటీ సిఫార్సులు లేకుండానే రైల్వే జోన్లు కేటాయించారని, నేడు కేబినెట్‌లో నిర్ణయం తీసుకోకుండా కమిటీపై ఆ భారాన్ని వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేబినెట్ కన్నా కమిటీ సుప్రీం కాదు కదా అని మండిపడ్డారు. నేడు పట్ట్భద్ర ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా రాజకీయ పార్టీలు ప్రభావితం చేయడం శోచనీయమన్నారు.
లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు ప్రత్యేక డెవలప్‌మెంట్ ప్యాకేజీ కింద మంజూరు చేసిన నిధులను కూడా ఖర్చు చేయలేని దుస్ధితిలో ఉన్నారని, అలాంటి వారికా ఓటు వేసేది అని ప్రశ్నించారు. బిజెపి, టిడిపిలకు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. జ్యూట్ మిల్లులు మూతపడి కార్మికులు రోడ్డున పడగా నేటి వరకు వాటిని తెరిపించలేకపోయారని విమర్శించారు. అలాగే ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు కూడా సంక్షోభంలో ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో రమణమూర్తికి ఓటు వేసి టిడిపి, బిజెపిలకు గుణపాఠం చెప్పాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో జెవివి రాష్ట్ర అధ్యక్షుడు ఎంవిఆర్ కృష్ణాజీ, పౌరవేదిక ఉపాధ్యక్షుడు ఎల్‌కె జైన్, జి.పైడితల్లి, లోక్‌సత్తా ప్రతినిధులు ఆర్.సుధాకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి పోరాడే వ్యక్తిని గెలిపించండి

* పిడిఎఫ్ ఎమ్మెల్సీ శర్మ

విజయనగరం(టౌన్), మార్చి 6: పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం పోరాడే వ్యక్తికి మొదటిప్రాధాన్యత ఓటు వేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ శర్మ తెలిపారు. సోమవారం పట్టణంలోని ఎన్‌జిఓ హోంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి- బిజెపిల పాలనలో ఉత్తరాంధ్ర తీవ్ర నిర్లక్ష్యానికి గురయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అభివృద్ధిమంత్రం జపించడం మినహా ఉత్తరాంధ్రకు ఒరగబెట్టింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. పెట్టుబడులు వస్తాయని ఊరించడమే కానీ ఇంతవరకు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు కాలేదని అన్నారు. కొత్తగా కొలువులు ఇస్తారని ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే మిగిల్చారని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందని భావించిన వారంతా ఇపుడు బాధ పడుతున్నారని చెప్పారు. 40 వేల పోస్టులు పోయాయని, టీచర్ పోస్టుల భర్తీకి డి ఎస్సీ ప్రకటించలేదని కేవలం కాలక్షేపం చేయడం మినహా నిరుద్యోగులకు మొండిచేయి మిగిలిందని విమర్శించారు. టిడిపి- బిజెపిల పాలనలో ఉత్తరాంధ్ర నయవంచనకు గురయిందని తీవ్రంగా ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీ విషయంలో కేంద్రమంత్రికి, రాష్ట్ర మంత్రికి మధ్యనెలకొన్న అభిప్రాయ బేధాల్లో నలుగుతోందని ఆరోపించారు.
216 సంఘాలు బలపరిచిన పిడి ఎఫ్ అభ్యర్ధి అజశర్మకు అవకాశం ఇవ్వాలని కోరారు. తన పదవీకాలంలో అనేక సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించే అవకాశం కల్పించిన పట్ట్భద్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాము, జిల్లా అధ్యక్షుడు శేషగిరి, గౌరవాధ్యక్షుడు అల్లూరి శివవర్మ, రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి శ్యామ్ పాల్గొన్నారు.