విజయనగరం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సమాప్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 7: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. నామినేషన్ ఘట్టం పూర్తయినప్పటి నుంచి మూడు వారాలపాటు అభ్యర్థులు అలుపెరగకుండా ప్రచారం చేపట్టారు. ఈ దఫా ఎమ్మెల్సీ ఎన్నికలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికల ప్రచారం నువ్వా? నేనా? అన్న రీతిలో నిర్వహించారు. పట్ట్భద్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని శక్తులను ఒడ్డారు. అభ్యర్థులు తమను గెలిపిస్తే ఉత్తరాంధ్ర సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రధానంగా సిపిఎస్ విధానం, నిరుద్యోగ భృతి, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత తదితర అంశాలను ప్రస్తావించారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు.
ప్రధానంగా పిడిఎఫ్ అభ్యర్థి అజశర్మకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, వామపక్షాలు, యుటిఎఫ్ నేతలు ప్రచారం నిర్వహించారు. ఇక బిజెపి అభ్యర్థి పివిఎన్ మాధవ్‌కు కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు కిమిడి మృణాళిని, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లతోపాటు ఎమ్మెల్సీలు జగదీష్, గుమ్మడి సంధ్యారాణి, గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు మీసాల గీత, కోళ్ల లలితకుమారి, డాక్టర్ కెఎ నాయుడు తదితరులు ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజు తరఫున కాంగ్రెస్ నాయకులు, వైకాపా నాయకులను కూడగట్టుకొని ప్రచారం చేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థి వివి రమణమూర్తికి లోక్‌సత్తా మద్దతునిచ్చింది. మరో స్వతంత్ర అభ్యర్థి పతివాడ రమణ, ఎంబిఎ అప్పారావు దొర, ఆదాడ మోహనరావు తదితరులు ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటంతో వారి మద్దతు కూడగట్టుకునేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ దఫా ఎన్నికలకు విశాఖపట్నంలో ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటంతో తమ ప్రచారంలో ఎక్కువ కాలం విశాఖపట్నం జిల్లాపైనే దృష్టిసారించారు.

ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
విజయనగరం (్ఫర్టు), మార్చి 7: ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తుందని వైకాపా ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విజయనగరం నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అవినీతి, అక్రమాలు, ఆరాచకాలకు పాల్పడేవారికి తెలుగుదేశం ప్రభుత్వం మద్ధతు ఇస్తుందని ఆరోపించారు. నీతివంతమైన పాలన అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం అవినీతిమయంగా తయారైందని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. గ్రామస్థాయి నుంచి వైకాపాను బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, దీనిలోభాగంగా బూత్‌స్ధాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 11వతేదీన విజయనగరం మయూర హోటల్‌లో ఉదయం పది గంటలకు రైతు, యువజన, విద్యార్థి, మహిళా విభాగాలతో సమావేశం జరుగుతుందన్నారు. వైకాపా కేంద్ర కమిటీ సభ్యుడు పి.సాంబశివరాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థి విజయానికి పార్టీశ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కెవి సూర్యనారాయణ, అంబళ్ల శ్రీరాములునాయుడు, అల్లు చాణుక్య, సత్తరవుశంకరరావు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు వేణు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.