విజయనగరం

గంట్యాడలో పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, మార్చి 9: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గంట్యాడ మండలంలో గురువారం ప్రశాంతంగా జరిగింది. 835 మంది ఓటర్లకు గాను 657మంది పట్ట్భద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల కేంద్రమైన గంట్యాడలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ. నాయుడు, ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యిర్థిగా పోటీ చేస్తున్న లగుడు గోవిందరావు గంట్యాడలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తరువాత జోరందుకుంది. జోనల్ అధికారి రాజేంద్ర ప్రసాద్ గంట్యాడలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ తీరును పరిశీలించారు. పోలింగ్ సమయం ముగిసే సరికి ముగ్గురు ఓటర్లు ఓటు వేయడానికి కేంద్రంలోకి రాగా సమయం ముగిసినందున ఓటు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. ఎన్నికల అధికారి తహశీల్దార్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది.

సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

గంట్యాడ, మార్చి 9: మామిడి పంటలో అధిక దిగుబడులు సాధించడానికి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని గజపతినగరం ఉద్యాన శాఖ ఎడి జి.వి. లక్ష్మి అన్నారు. మండలంలోని మామిడి రైతులకు గొడియాడ గ్రామంలో సస్యరక్షణ చర్యలపై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుగుల మందు వాడకం, యాజమాన్య పద్ధతులు, ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ ఏడాది ఇంటిగ్రేటెడ్ బెస్ట్ మేనేజ్‌మెంట్ కింద 636 మంది రైతులకు రాయితీతో కూడిన ఫిరమెంట్ ట్య్రాప్‌లు, స్టిక్సీ ట్య్రాప్స్ రైతులకు సదస్సులో పంపిణీ చేశారు. అలాగే ఉద్యాన శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను రైతులకు తెలియజేశారు. ఈ సదస్సులో విజయనగరం డాట్ సెంటర్ శాస్తవ్రేత్త ఎం ఎం వి శ్రీనివాసరావు, ఉద్యాన అధికారిణి బి.దీప్తి, ఎం ఇ ఓ బాలకృష్ణ, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి

దత్తిరాజేరు, మార్చి 9: మండలంలోని పెద గ్రామానికి చెందిన ఎల్. రాము(30) వంగర గ్రామంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అనారోగ్యంతో తన సొంత గ్రామమైన పెదకాదలో మృతి చెందారు. మృతి చెందిన ఉపాధ్యాయుడు రాముకి భార్య కీర్తన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకస్మాత్తుగా రాము మృతి చెందడంతో తోటి ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు సంతాపం ప్రకటించారు. చిన్న వయస్సులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి విధులు నిర్వహిస్తున్న రాము మృతి పట్ల కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.