విజయనగరం

బారులు తీరిన ఓటర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 9: పట్ట్భద్ర ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు మందకొడిగా పోలింగ్ సాగినప్పటికీ, ఆ తరువాత క్యూ లైన్లలో బారులుతీరారు. జిల్లాలో పోలింగ్ ముగిసే సమయానికి డెంకాడ, కొత్తవలసలో ఓటర్లు క్యూలో ఉండటంతో వారందరికీ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. గిరిజన ప్రాంతమైన కురుపాం నియోజకవర్గంలో 73 శాతం పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ, ఆ తరువాత పోలింగ్ ఊపందుకుంది. ఉదయం 9 గంటలకు 4 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటలకు 9 శాతం, 11 గంటలకు 14శాతం, మధ్యాహ్నాం 12 గంటలకు 22 శాతం ఓట్లు పోలయ్యాయి. 4 గంటలకు 58.5 శాతం, సాయంత్రం 5 గంటలకు 64.5 శాతం, 6 గంటలకు 70.49 శాతం పోలింగ్ జరిగింది.
కురుపాం మండలంలో 83 శాతం, జియ్యమ్మవలసలో 65 శాతం, గరుగుబిల్లిలో 61 శాతం, కొమరాడలో 82 శాతం, జిఎల్ పురంలో 83 శాతం ఓట్లు పోలయ్యాయి. గజపతినగరంలో 82.72, చీపురుపల్లిలో 72, ఎల్‌కోటలో 81, బొబ్బిలిలో 72, గంట్యాడలో 78.9, సాలూరు 75.8 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇక బొబ్బిలిలో ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, అతని సోదరులు బేబినాయన, రామకృష్ణ రంగారావులకు ఓటు హక్కు లేకపోవడం పట్ల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దరఖాస్తు అందజేశామని ఎమ్మెల్యే, తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదని తహశీల్దార్ బదులిచ్చారు. దీంతో ఆయన ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోయారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం, డూప్లికేటు పేర్లు ఉండటంతో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసేందుకు అవస్థలు పడ్డారు. ఏది ఏమైనప్పటికీ ప్రశాంతంగా పోలింగ్ జరగడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ వెంకట అప్పలనాయుడు వివిధ పోలింగ్ స్టేషన్లను పరిశీలించి ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సూక్ష్మ పరిశీలకులు ప్రవీణ్‌కుమార్ జిల్లాలోని బోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

నెల్లిమర్లలో ప్రశాంతం

నెల్లిమర్ల, మార్చి 9: నెల్లిమర్లలో ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. నగర పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో 1382 ఓటర్లు ఉండగా పోలింగ్ అధికారులు రెండు బూతులను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు పటు చేశారు. ఓటర్లు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లు పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లనీయకుండా పోలీసులు నివారించారు. 30 మంది ఉండడం వలన ఓటు వేయడానికి ఓటరకు సమయం ఎక్కువ అవుతుంది. ఓటర్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రెవెన్యూ సిబ్బంది శిబిరాలను ఏర్పాటు చేసి ఓటు స్లిప్‌లను అందజేశారు. అభ్యర్థుల శిబిరాలు 200 మీటర్ల దూరంగా పెట్టడానికి పోలింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారు. స్లిప్‌లు మరచిపోయిన అభ్యర్థులకు కంప్యూటర్‌లో చెక్‌చేసి రాసి ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయ.

జామిలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఓటింగ్

జామి, మార్చి 9: 673 మంది ఓటర్లలో 482 మంది ఓటర్లు పోలింగ్ నిర్వహించారు. జామి హైస్కూల్‌లో 101 పోలింగ్ కేంద్రంలో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలు సంబంధించి ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ కేంద్రంలో 22 మంది అభ్యర్థులకు గాను ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి మాత్రమే ఆయా అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి సంబంధించి 673 మంది ఓటర్లు ఉండగా 482 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలింగ్ అధికారులు పర్యవేక్షణలో పోలీసుల బందోబస్తు మధ్య ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. అభ్యర్థి పి.వి. ఎస్. మాధవ్‌కు అధికార పార్టీ నాయకులు మద్దతు పలకగా, స్వతంత్ర అజశర్మకు 200 ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, వైకాపా నాయకులు మద్దతు పలికారు. ఆయా పార్టీల నాయకులు ఓటర్లను కూడబెట్టుకోవడంలో సందడి వాతావరణం కనిపించింది.